సంగారెడ్డిలో ఘోరం.. మద్యం తాగించి భర్తను చంపిన భార్య

తమ సంబంధానికి అడ్డు తగలుతున్నాడని భావించి.. భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. మరో మహిళతో కలిసి ఆ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి భర్తను హతమార్చింది.

news18-telugu
Updated: February 21, 2020, 5:02 PM IST
సంగారెడ్డిలో ఘోరం.. మద్యం తాగించి భర్తను చంపిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతన్నాయి. జీవితాలను నాశనం చేయడమే కాదు ప్రాణాలను కూడా తీస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డగా ఉన్నాడన్న కారణంతో భర్తను చంపిదో భార్య. మద్యం తాగించిన తర్వాత మత్తులో ఉన్న సమయంలో హత్య చేసింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు సంగారెడ్డిలోని బీరప్ప కాలనీలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఐతే ఇటీవల వెంకటమ్మ మరో వ్యక్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి అడ్డు తగలుతున్నాడని భావించి.. భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. మరో మహిళతో కలిసి ఆ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి భర్తను హతమార్చింది. అతడికి మద్యం తాగించి..అనంతరం హత్చ చేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని అమీన్‌పూర్ లాల్‌భాయ్ కాలనీ వద్ద విసిరేసింది. అక్కడ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. తమకు దొరికిన ఆధారాలతో దర్యాప్తు చేయగా, భార్యే హంతకురాలని తేలింది. వెంకటమ్మతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు