ధన్బాద్: జార్ఖండ్‌లోని ధన్బాద్ జిల్లాలో ఓ భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని మహువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మహువా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తన్నూ కుమారి, అజయ్ దాస్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం వీళ్లిద్దరికీ వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధమే వీరిది. పెళ్లయిన కొన్నాళ్లు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. కానీ.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగింది.
భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడేమోనని భార్య అనుమానిస్తే.. భార్య తనతో కాకుండా మరొకరితో చనువుగా ఉంటుందేమోనని భర్త అనుమానించాడు. ఈ అనుమానాలు పెరిగి ఒకరితో ఒకరు రోజూ గొడవ పడేంత వరకూ పరిస్థితి వెళ్లింది. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం నిత్య కృత్యమైంది. అయితే.. కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ కొంత బాగానే ఉన్నట్లు కనిపించడంతో ఇరు కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ.. ఇంతలోనే జరిగిన ఓ పరిణామం ఊహించని షాక్‌కు గురిచేసింది. నవంబర్ 16న అజయ్‌కు తన భార్య కూల్ డ్రింక్ ఇచ్చింది.
భార్య ప్రేమతో ఇచ్చింది కదా అని ఆ కూల్ డ్రింక్ తాగిన అజయ్ ఆ తర్వాత కొద్దిసేపటికే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. అజయ్‌ను ఆ స్థితిలో చూసిన అతని తల్లిదండ్రులు ఊహించని ఈ ఘటనతో అతనిని వెంటనే బొకారో బీజీహెచ్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం అజయ్‌ను రాంచీ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. రాంచీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడు. అయితే.. ఈలోపు వాంగ్మూలం ఇచ్చిన అజయ్ భార్య గురించి కీలక విషయాలను బయటపెట్టాడు.
స్కూల్‌లో పగలు పాఠాలు.. రాత్రుళ్లు పార్టీలు.. హెడ్‌మాస్టర్, టీచర్ నిర్వాకం.. బీహార్‌లోని కృష్ణగంజ్‌లో ఘటన.. వీడియోలో చూడండి
తన భార్యకు వేరొకరితో అఫైర్ ఉందని.. పెళ్లయినప్పటి నుంచి తనతో సఖ్యతగా మెలగలేదని చెప్పాడు. అంతేకాదు.. తనని, తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించిందని కూడా వాపోయాడు. తనతో ఉండటానికి అసలు ఇష్టపడేది కాదని చెప్పాడు. ఇదిలా ఉండగా.. అజయ్ చావుకు అతని భార్యే కారణమని.. ఆ కూల్ డ్రింక్‌లో విషం కలిపి తన అన్నయ్యను చంపేసిందని అజయ్ తమ్ముడు ఆరోపించాడు.
అజయ్ తండ్రి మాట్లాడుతూ.. తన కోడలు మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని.. రాత్రుళ్లు పొద్దుపోయే వరకూ గంటల తరబడి ఫోన్ మాట్లాడుతూనే ఉండేదని.. ఆమె ప్రవర్తనపై ప్రశ్నిస్తే తమ కొడుకుపై కోపగించుకునేదని చెప్పాడు. అజయ్ మృతదేహంతో అతని కుటుంబ సభ్యులు మహువా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తమ కొడుకును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న కోడలిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. ఆ కూల్ డ్రింక్‌లో విషం కలిసిందా లేదా అనే విషయంలో ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband, Illict affair suspicion, Wife