Home /News /crime /

WIFE FLED AWAY WITH JEWELLERY CASH AND MOBILE AFTER TWO MONTHS OF MARRIAGE HUSBAND COMMITTED SUICIDE AK

Shocking: దేవుడా.. ఇతడికి వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదు.. పెళ్లయిన రెండు నెలలకే భార్య అలా చేయడంతో..

సీతారాం, సోనా (ఫైల్ ఫోటో)

సీతారాం, సోనా (ఫైల్ ఫోటో)

Husband Suicide: తన బ్యాంకు ఖాతాలో 1.30 లక్షల రూపాయలు, కంపెనీలో లక్ష రూపాయల పిఎఫ్‌ను నా కుటుంబ సభ్యులు తీసుకోవాలని సూచించాడు. తన మామ కొడుకు దేవకిషన్ దగ్గర తొమ్మిదిన్నర వేలు అప్పుగా తీసుకున్నానని... అతడి డబ్బు తిరిగి అతడికి ఇవ్వాలని సూచించాడు.

ఇంకా చదవండి ...
    జైపూర్ సీతాపురలోని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సీతారాం రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. పెళ్లయ్యాక రెండు నెలలు భార్యాభర్తలు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ రోజు అతను పనికి వెళ్లిన సమయంలో భార్య నగలు, నగదు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది. ఇంటికి వచ్చిన భర్తకు భార్య కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించాడు. అయితే బుండిలో ఉన్న మాజీ భర్త వద్దకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని తెలిసింది. భార్య చేసిన ఈ ద్రోహానికి యువకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనతో రెండు నెలలపాటు ఎంతో అనోన్యంగా ఉన్న భార్య ఇలా ఎందుకు చేసిందని ఎంతగానో ఆలోచించాడు. అసలు ఆమె అలా ఎందుకు చేసిందో అతడికి అర్థంకాలేదు.

    అయితే ఈ విషయంలో తాను మోసపోయానని నిర్ణయానికి వచ్చిన సీతారాం.. మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి వద్ద ఉన్న సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. బుండి జిల్లాకు చెందిన శ్యామ్ విహార్ ప్రతాప్ నగర్‌లో సీతారాం తన భార్యతో కలిసి నివసించాడు. సీతాపురాలోని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. సుమారు 2 నెలల క్రితం, అతను దియాలీ బండి నివాసి అయిన 28 ఏళ్ల సోనాతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మే 26న అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది.

    తన భార్య కోసం ఎంతగానో వెతికిన సీతారాం.. ఆమె తన మాజీ భర్త వద్దకు వెళ్లిందని తెలిసి షాక్ అయ్యాడు. ఆమె మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుసుకుని మానసికంగా కుంగిపోయాడు. తాను మోసపోయాయని.. ఇక తన బంధువులకు తన ముఖం చూపించలేనని నిర్ణయించుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌లో రాసిన మొబైల్ నంబర్ ఆధారంగా బంధువులను సంప్రదించి గుర్తించారు. తన సూసైడ్ నోట్‌లో సీతారాం పలు విషయాలు ప్రస్తావించాడు. తాను భార్య చేతిలో మోసపోయానని.. ఈ విషయంలో తన కుటుంబసభ్యులను ఇబ్బందిపెట్టవద్దని పేర్కొన్నాడు.

    Crime news: మాజీ ప్రేమికుడి స్నేహితుడే ఇంత పని చేస్తాడనుకోలేదు ఆ యువతి.. ఆమెతో సాన్నిహిత్యం నటించి చివరికి..

    Case On R Krishnaiah: వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్ కేసు

    తన బ్యాంకు ఖాతాలో 1.30 లక్షల రూపాయలు, కంపెనీలో లక్ష రూపాయల పిఎఫ్‌ను నా కుటుంబ సభ్యులు తీసుకోవాలని సూచించాడు. తన మామ కొడుకు దేవకిషన్ దగ్గర తొమ్మిదిన్నర వేలు అప్పుగా తీసుకున్నానని... అతడి డబ్బు తిరిగి అతడికి ఇవ్వాలని సూచించాడు. మృతుడి సోదరుడు బన్షీలాల్, సీతారాం భార్య సోనాపై కేసు పెట్టారు. రెండు నెలల క్రితం తన సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మే 26న భాయ్ సీతారాం ఫ్యాక్టరీకి వెళ్లాడని.. ఇదే అవకాశంగా మార్చుకుని భార్య సోనా ఇంట్లో ఉంచిన నగలు, 2 లక్షల నగదు, 2 మొబైల్స్‌తో పరారైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు