హోమ్ /వార్తలు /క్రైమ్ /

నలుగురితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం.. మాట్రిమోని వెబ్‌సైట్ వేదికగా మోసాలు

నలుగురితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం.. మాట్రిమోని వెబ్‌సైట్ వేదికగా మోసాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా.. ఆరుగురితో సహజీవనం చేస్తున్నాడు. అతని చేతిలో మోసపోయిన మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

  మాట్రిమోని వెబ్ సైట్ల వేధికగా అనేక మంది దుర్మార్గులు మోసాలకు పాల్పడుతున్నారు. దొంగ పేర్లు, వివరాలతో అనేక పెళ్లిళ్లు చేసుకుంటూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాయమాటలు చెప్పి నమ్మించి, లక్షల కొద్దీ కట్నం తీసుకుని.. అవసరం తీరాక వాళ్లను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన హైదరాబాద్ లో మరొకటి చోటు చేసుకుంది. ఓ మోసగాడు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా.. ఆరుగురితో సహజీవనం చేస్తున్నాడు. అతని చేతిలో మోసపోయిన మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. హిమబిందు అనే మహిళకు 2018లో ఓ మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణప్యాలస్‌లో నివాసం ఉంటున్న వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే ఈ సంబంధం ఓ మాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా కుదిరింది.

  పెళ్లి సమయంలో కట్నంగా రూ.28 లక్షలు, వివాహ ఖర్చులకు మరో రూ.10 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలు చెప్పింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత పవన్ కుమార్ ఆ మహిళను దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. ఒక రోజు ఇస్త్రీ పెట్టెతో తన ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది. అనేక సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తనకు ఇప్పటికే మరో ముగ్గురితో పెళ్లి జరిగిందని ఆ నిందితుడు బాధితురాలికి చెప్పాడు. మొదటి, రెండో భార్యను వదిలేసినట్లు అతనే తనతో స్వయంగా చెప్పాడని బాధితురాలు తెలిపింది.

  అంతే కాకుండా మూడో భార్యను తనకు నేరుగా తనకు పరిచయం చేశాడని చెప్పింది. ఆ మూడో భార్యే తన నిజమైన భార్య అని చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అతడు మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. సంవత్సరం క్రితం మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టానని, న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు బాధిత మహిళ చెబుతోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తనను మోసం చేసిన పవన్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Crime news, Hyderabad, Love cheating

  ఉత్తమ కథలు