Khammam: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన భార్యాభర్త.. భార్య అంత పని చేస్తుందని ఆ భర్త అనుకొని ఉండడు..!

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

అదే గ్రామానికి చెందిన జోగారావుతో చిన్నికి పరిచయం ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడల్లా జోగారావుతో చిన్ని సన్నిహితంగా ఉంటుండేది. ఆ సాన్నిహిత్యం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏడాది నుంచి ఇద్దరూ రాంలాల్ కళ్లు గప్పి...

  • Share this:
    ఖమ్మం: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. పర పురుషుడి వ్యామోహంలో, పర స్త్రీ మోజులో పడి భార్యలను, భర్తలను చంపుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం గడ్డిగుట్ట గ్రామానికి చెందిన బోడ రాంలాల్‌కు చిన్ని అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే.. భర్తతో కొన్నాళ్లు సఖ్యంగానే ఉన్న చిన్ని ప్రవర్తనలో ఆ తర్వాత మార్పు వచ్చింది. అదే గ్రామానికి చెందిన జోగారావుతో చిన్నికి పరిచయం ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడల్లా జోగారావుతో చిన్ని సన్నిహితంగా ఉంటుండేది. ఆ సాన్నిహిత్యం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏడాది నుంచి ఇద్దరూ రాంలాల్ కళ్లు గప్పి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే.. తమ సంబంధం గురించి భర్తకు తెలిస్తే ప్రమాదమని భావించిన చిన్ని తన ప్రియుడు జోగారావును కలిసి విషయం చెప్పింది. తన భర్తను చంపేద్దామని జోగారావుతో చిన్ని చెప్పగా అందుకు అతను కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి రాంలాల్ హత్యకు పక్కాగా ప్లాన్ చేశారు. చిన్ని, జోగారావు ఒక రోజు ఇల్లందులోని ఓ లాడ్జిలో గడపాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు రాంలాల్‌కు స్పాట్ పెట్టారు. అయితే.. ఆ రోజు రాంలాల్ ఇల్లందుకు రాకపోవడంతో ప్లాన్ విఫలమైంది. మార్చి 24వ తేదీన పొలానికి నీళ్లు పెట్టేందుకు రాత్రి సమయంలో రాంలాల్ వెళ్లాడు. తన భర్తను చంపేందుకు ఇదే అదనుగా భావించిన చిన్ని తన భర్త పొలానికెళ్లిన విషయాన్ని ప్రియుడికి చేరవేసింది.

    తాను కూడా రాంలాల్‌తో పాటు పొలానికి వచ్చానని.. తొందరగా వచ్చి భర్తను చంపాలని జోగారావుకు ఫోన్ చేసి చెప్పింది. రాంలాల్ పొలానికి నీళ్లు పెడుతుండగా అక్కడికి వచ్చిన జోగారావు వెనుక నుంచి అతనిని నెట్టివేశాడు. కిందపడిన రాంలాల్ వీపుపై కూర్చుని ఊపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రాంలాల్ చనిపోయాడు. అయితే.. ఈ హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు చిన్ని, ఆమె ప్రియుడు చాలానే చేశారు.

    రాంలాల్ శవం పైనా, కింద దుప్పట్లు వేసి, పక్కన మద్యం బాటిల్, మాంసం ఉంచి ఇది సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే.. రాంలాల్ కొడుకు తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆరా తీయగా.. చిన్ని, ఆమె ప్రియుడు జోగారావు ఊరిలో లేకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే.. పోలీసులు అరెస్ట్ చేసే లోపే చిన్ని, ఆమె ప్రియుడు జోగారావు గడ్డిగుట్ట సర్పంచ్ భర్త అయిన రవి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. నేరం తామే చేసినట్లు అంగీకరించారు. దీంతో.. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: