Home /News /crime /

WIFE EXTRA MARITAL AFFAIR LEADS TO HUSBAND MURDER IN TAMILNADU SSR

సడన్‌గా అర్ధరాత్రి ఇంటికొచ్చిన భర్త.. మంచంపై వాళ్లిద్దరినీ అలా చూసి కూడా..

లియో, సుచిత్ర మేరీ

లియో, సుచిత్ర మేరీ

తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఓ యువకుడి మోజులో పడి భార్యే అంతమొందించిన ఘటన విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా విక్రవండి ప్రాంతానికి చెందిన...

  విల్లుపురం: తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఓ యువకుడి మోజులో పడి భార్యే అంతమొందించిన ఘటన విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా విక్రవండి ప్రాంతానికి చెందిన లియోపాల్డ్, సుచిత్రా మేరీ ప్రేమించుకున్నారు. లియో చూడటానికి కొంచెం నల్లగా ఉండేవాడు. మేరీ తెల్లగా, అందంగా ఉండేది. తన రంగు కాకుండా మనసును చూసి ప్రేమించిందని లియో అనుకున్నాడు గానీ ఆమె రంగులు మార్చే ఊసరవెల్లి అని కనిపెట్టలేకపోయాడు. లియో డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. చెన్నైలో ఓ ఇల్లు తీసుకుని ఇద్దరూ పిల్లలతో నివాసమున్నారు. ఈ దంపతుల జీవితం హ్యాపీగా సాగిపోతున్న సమయంలో కరోనా కారణంగా చెన్నైలో లాక్‌డౌన్ విధించారు. లాక్‌డౌన్ కారణంగా డ్రైవర్ అయిన లియోకు పని లేకుండా పోయింది. తమ వద్ద ఉన్న కొద్దోగొప్పో డబ్బుతో కొన్నాళ్లు చెన్నైలోనే ఉన్నప్పటికీ రానురానూ అద్దె కట్టడం, పిల్లలకు తిండి పెట్టడం కూడా ఈ దంపతులకు కష్టంగా మారింది. దీంతో.. చేసేదేమీ లేక మేరీని, పిల్లలను లియో సొంతూరికి తీసుకెళ్లిపోయాడు.

  లాక్‌డౌన్ ఎత్తేశాక.. లియో మళ్లీ పనివెతుక్కుంటూ భార్య, పిల్లలను సొంతూరిలోనే వదిలేసి చెన్నైకి వెళ్లాడు. చెన్నైలో పనిదొరకడంతో డబ్బు సంపాదించి ఇంటికి పంపుతూ భార్యా, బిడ్డలను లియో సుఖంగా చూసుకుంటున్నాడు. కానీ.. భార్యాపిల్లలను ఊర్లోనే ఉంచి రావడమే లియో చేసిన తప్పయిపోయింది. ఆ ఊర్లోనే ఉండే రాకీ అనే యువకుడితో మేరీకి పరిచయం ఏర్పడింది. దూరంగా ఉన్న భర్తను మరింత దూరం చేసుకుని ఆ యువకుడికి మేరీ దగ్గరయింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. లియో అప్పుడప్పుడూ చెన్నై నుంచి వచ్చినప్పటికీ అతని ముందు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ మేరీ భర్తను నమ్మించేది. అతను తిరిగి చెన్నైకి వెళ్లిపోగానే.. ఇంట్లోనే ప్రియుడితో మేరీ సరసాలు సాగించేది.

  ఒకరోజు భార్యకు చెప్పకుండా చెన్నై నుంచి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన లియో తలుపు తీసి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. తన భార్య మేరీ, ఆమె ప్రియుడు రాకీ మంచంపై సరససల్లాపాలు సాగిస్తూ లియోకు కనిపించారు. మరో గదిలో పిల్లలిద్దరూ నిద్రిస్తున్నారు. పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుతుందని భార్యపై నమ్మకం పెట్టుకుంటే.. మరో వ్యక్తితో శారీరకంగా దగ్గరవడాన్ని లియో తట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ.. పిల్లల కోసం ఆ బాధను దిగమింగుకుని భార్యకు, ఆమె ప్రియుడికీ వార్నింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా జరిగితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అయితే.. లియో బతికుంటే తమ ఆటలు సాగవని భావించిన మేరీ, ఆమె ప్రియుడు లియోను చంపాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 4న మద్యం తాగి ఇంటికెళ్లిన లియో ఆ మత్తులో నిద్రపోయాడు.

  ఇదే అదనుగా భావించిన మేరీ తన భర్తను చంపే అవకాశం వచ్చిందని రాకీకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరింది. రాకీ వచ్చాక ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న లియోను గొంతు పిసికి, ఇనుప రాడ్‌తో దాడి చేసి హతమార్చారు. లియో మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న పెరట్లో పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా వారి సంబంధాన్ని కొనసాగించారు. అయితే.. ఈ ఘటన జరిగిన రెండుమూడు రోజులకు లియో తండ్రి సహాయం అతని ఇంటికి వెళ్లాడు. కోడలు, పిల్లలు మాత్రమే కనిపించడంతో తన కొడుకు లియో ఎక్కడికి వెళ్లాడని మేరీని సహాయం ప్రశ్నించాడు. పెళ్లికి వెళ్లాడని, ఇంకా రాలేదని మేరీ కాకమ్మ కబుర్లు చెప్పింది.

  కోడలి ప్రవర్తనపై అనుమానమొచ్చిన సహాయం ఇంటి వెనుక పెరట్లో గొయ్యి తీసి మళ్లీ పూడ్చేసిన విషయాన్ని గమనించాడు. అక్కడ గొయ్యి తీసి ఎందుకు పూడ్చి వేశారని మేరీని అడగ్గా ఏవేవో కబుర్లు చెప్పింది. దీంతో.. భయంతో లియో తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పూడ్చిన చోట మట్టి తీసి చూడగా లియో మృతదేహం లభ్యమైంది. మేరీ, ఆమె ప్రియుడు పరారయ్యారు. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లియో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే లియోకు తీరని ద్రోహం చేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Chennai, Crime news, Tamilnadu, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు