10 ఏళ్లుగా దూరం.. విడాకులు కోరిన భర్త.. భార్య ఎంతపని చేసిందంటే..

ఐదేళ్లు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచీ పుట్టింట్లోనే ఉంటుంది కవిత.

news18-telugu
Updated: September 11, 2020, 7:52 AM IST
10 ఏళ్లుగా దూరం.. విడాకులు కోరిన భర్త.. భార్య ఎంతపని చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్త విడాకులు కోరాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత (39) అనే మహిళ పెద్ద అంబర్‌పేట్ మైత్రీపురంలో నివసిస్తోంది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో నివసించే పగడాల నవీన్ కుమార్‌తో ఆమె వివాహం జరిగింది. ఐదేళ్లు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచీ పుట్టింట్లోనే ఉంటుంది కవిత. ఐతే ఇటీవల భర్త నవీన్ కుమార్ విడాకుల కోసం కోర్టులో కేసు వేశాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కవిత గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని మరణించింది. తల్లిదండ్రులు నిద్రలేచి చూసే సరికి బెడ్‌రూమ్‌లో ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. ఘటనపై మృతురాలి తమ్ముడు నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 11, 2020, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading