హోమ్ /వార్తలు /crime /

దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...

దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...

రోడ్డు ప్రమాదంలో కేరళ వాసి మృతి... భర్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటూ భారీ జరిమానా విధించిన ప్రభుత్వం...

    దుబాయ్‌లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. పొరపాటున ఆ చట్టాలను అతిక్రమిస్తే శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. తాజాగా ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన భార్య శవాన్ని, స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏకంగా రూ. 40 లక్షలు చెల్లించాల్సి వచ్చింది ఓ భర్త. దుబాయ్‌లోని రస్ అల్ కైమా నగరంలో జరిగిన ఈ సంఘటనలో బాధితులు కేరళవాసులు కావడం విశేషం. కేరళ ఒట్టపాలం ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ఆయన భార్య దివ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. రస్ అల్ కైమా సిటీలో ఉంటూ ఉద్యోగం చేసేవాళ్లు. గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్య చనిపోయింది.

    అయితే దివ్య మృతదేహాన్ని భర్త ప్రవీణ్‌ను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ‘నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే నీ భర్య చనిపోయింది.... అందుకు ప్రతిఫలంగా కోర్టుకు 2లక్షల దిన్హామ్‌లు (దాదాపు రూ. 40 లక్షలు) చెల్లించాలంటూ ఆదేశించారు. అనుకోకుండా ప్రమాదం జరిగిందని, తాను కావాలని చేయాలేదని... సీటు బెల్ట్ కూడా ధరించామని మొత్తుకున్నా ప్రవీణ్ గోడు వినలేదు. దాంతో ఏం చేయాలో తెలియక మొత్తం చెల్లించేందుకు సిద్దమయ్యాడు. ప్రవీణ్ బంధువులు, స్నేహితులు అంతా కలిసి నష్టపరిహారంగా చెల్లించాల్సిన డబ్బును పొగేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదానికి తనను బాధ్యుడిని చేయడంతో ప్రవీణ్... తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సిన్ బోర్డ్ పోస్ట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడగా... దివ్య చికిత్స పొందుతూ మరణించింది.

    ఇవి కూడా చదవండి...

    భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...

    బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

    కోతికి చక్కలిగింతలు పెట్టినందుకు మూడు సంవత్సరాలు జైలు.. ఎక్కడో తెలుసా...!

    8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

    First published:

    ఉత్తమ కథలు