భార్యకు కరోనా అని ఫోన్.. పరారైన భర్త.. చివరకు

తన భార్యకు కరోనా పాజిటివ్ అని ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసి చెప్పడంతో.. వెంటనే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు పరారయ్యాడు ఆమె భర్త.

news18-telugu
Updated: August 11, 2020, 7:22 AM IST
భార్యకు కరోనా అని ఫోన్.. పరారైన భర్త.. చివరకు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మరింత ఛిద్రం చేస్తోంది. కరోనా సోకిన కుటుంబసభ్యులను వీధుల్లో వదిలేయడం, కరోనా కారణంగా చనిపోయిన బంధువుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు కరోనా అని తెలియగానే ఆమెను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు ఓ మనసులేని భర్త. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మంజునాథ్ అనే యువకుడు రెండేళ్ల కిందట గౌరి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం బెంగళూరు వచ్చిన ఈ జంట ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గౌరి ఓ ఒక షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా పని చేస్తుండగా.. మంజునాథ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే కొద్దిరోజుల క్రితం గౌరికి జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అదే సమయంలో కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చింది.

అయితే గౌరికి కరోనా పాజిటివ్ అని ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. దీంతో మంజునాథ్ బుద్ధి ఒక్కసారిగా మారిపోయింది. కరోనా వచ్చిన భార్యకు అండగా ఉండాల్సింది పోయి.. ఆమెతో ఉంటే తనకు ఎక్కడ కరోనా వస్తుందో అనే భయంతో వెంటనే ఆమెకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఈ మహిళకు శ్వాసకోశ సమస్య అధికం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ యువతి అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కన్నుమూసింది. గౌరి చనిపోయిన మరుసటి రోజు ఇంటి యజమాని ఈ విషయాన్ని గమనించాడు. ఆమె భర్తకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. చివరకు కార్పొరేషన్ అధికారులు వచ్చి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి అంతక్రియలు చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: August 11, 2020, 7:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading