• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • WIFE CUTS HER HUSBAND PENIS AND COOKS IT IN A FRYING PAN IN BRAZIL AK

భర్త మర్మాంగాన్ని కట్ చేసిన భార్య.. అంతటితో తగ్గని కోపం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

విడిపోయే విషయంలో జరిగిన గొడవ కారణంగానే మచాడో.. భర్తపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని తెలిపారు. పోలీసులు నిందితురాలు మృతుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన వంట గది కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
    బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంటలో ఉపయోగించింది. ఈ దారుణానికి పాల్పడిన 33 ఏళ్ల మచాడోను ఈ నెల 7 అరెస్ట్ చేశారు పోలీసులు. మృతుడు సాంటా కేటరినా ఇంట్లోనే నగ్నంగా, విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మచాడో, తన భర్త సాంటా కేటరినా మర్మాంగాన్ని కోసేసిన పెనం మీద నూనెలో వేసి వేయించింది. ఉదయం నాలుగు గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. విడిపోయే విషయంలో జరిగిన గొడవ కారణంగానే మచాడో.. భర్తపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని తెలిపారు. పోలీసులు నిందితురాలు మృతుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన వంటగది కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

    హత్యతో పాటు బాధితుడిని వేధింపులకు గురి చేసిన ఆరోపణల కారణంగా మచాడోను పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల పాటు కలిసి ఉన్న మచాడో, సాంటా కేటరినా రెండేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నరు. వీరికి 8 ఏళ్ల కొడుకుతో పాటు 5 ఏళ్ల కూతురు ఉంది. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో వారిద్దరూ అక్కడే ఉన్నారా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

    అయితే ఈ ఘటన జరగడానికి ముందే రోజు రాత్రి ఈ జంట బార్‌కు వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. మరోవైపు నిందితుడి నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలోనే మచాడో అతడిని హత్య చేసిందని ఆమె తరపు లాయర్ వాదించారు. అయితే తనను మోసం చేశాడనే కోపంతోనే మచాడో తన సోదరుడిని హత్య చేసిందని అతడి చెల్లెలు ఆరోపించింది. అయితే వీరి మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయని వారి బంధువులు తెలిపారు.

    ఓ సారి భర్తపై నిందితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. అయితే బాధితుడి చెల్లెలు తరపున లాయర్ వాదన మరోలా ఉంది. బాధితుడితో బంధాన్ని తెంచుకునేందుకు ఇష్టపడని నిందితురాలు.. అతడు తనతో ఉండకపోతే ఇంకెవరితోనూ ఉండొద్దనే ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: