Home /News /crime /

WIFE COMPLAINT ON HER HUSBAND WHO CHEATED 6 GIRLS IN THE NAME OF LOVE THROUGH FACEBOOK CHATTING IN PRAKASHAM DISTRICT NS PNR

భార్య ఉండగానే మరో ఆరుగురు యువతులకు వల.. ఎట్టకేలకు ఎలా చిక్కాడంటే..

నిందితుడు విజయ్ భాస్కర్(ఫైల్ ఫొటో)

నిందితుడు విజయ్ భాస్కర్(ఫైల్ ఫొటో)

Cheating Husband: ఓ దుర్మార్గుడు భార్య ఉండగానే ఏకంగా ఆరుగురు అమ్మాయిలకు వల వేసి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేంటని అడిగిన అతని భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. ఎట్టకేలకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    ఆన్లోన్లో అమ్మాయిలకు మాయమాటలు చెబుతూ వల విసరడం.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేయడం.. డబ్బులు గుంజడం ఇటీవల సర్వ సాధారణమైంది. ఇటీవల ఇలాంటి ఘటనలు అధికంగా వినిపిస్తున్నాయి. అపరిచితులతో ఆన్లైన్లో చాటింగ్ చేయవద్దని పోలీసులు, మీడియా ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కొందరూ వినకుండా కేటుగాళ్లను నమ్మి మోస పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు భార్య ఉండగానే ఏకంగా ఆరుగురు అమ్మాయిలకు వల వేసి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇదేంటని అడిగిన అతని భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. ఎట్టకేలకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన సౌజన్యకు హైదరాబాద్ చందానగర్ ఆర్టీసి కాలనీకి చెందిన కుర్ర విజయ్ భాస్కర్ తో 2017లో వివాహం జరిగింది. ఆ సమయంలో విజయ్ భాస్కర్ తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని, తనకు రూ. 45 వేల వేతనం వస్తుందని అబద్ధం చెప్పి సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు.

    అయితే ఎలాంటి ఉద్యోగం లేని విజయ్ భాస్కర్ అప్పటి నుంచి పనిపాట లేకుండా తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా తన మేనకోడలిపైనే కన్నెశాడు. అనతరం మరో ఇద్దరిని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఇలా మొత్తం ఆరుగురు యువతులను ముగ్గులోకి దించి మోసం చేసేందుకు యత్నించాడు. ఆంధ్రాకు చెందిన అమ్మాయిలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారినే టార్గెట్ చేసుకున్న విజయ్ భాస్కర్.. వారిని లవ్ ట్రాక్ లోకి దించి పైసలు కూడా వసూలు చేశాడు.

    ఇవన్నీ గమనించి ప్రశ్నించిన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. తన జల్సాల కోసం అదనపు కట్నం తీసుకురావాలని కొట్టేవాడు. భర్త పెట్టే వేధింపులు భరిస్తున్నా.. అత్తింటి వారు కూడా అతడికే మద్దతుగా నిలవడంతో చేసేదేమీ లేక ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి సమయంలో 25తులాల బంగారం, రూ.15లక్షలు కట్నంగా తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన మూడేళ్ల కుమారుడికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.

    విజయ్ బాస్కర్ అకృత్యాలపై స్పందించిన సౌజన్య కుటుంబ సభ్యులు అతడిని నిలదీసేసరికి ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ భార్య కాళ్లు పట్టుకున్నాడు. ఇలాంటి భర్త పగవాళ్లకు కూడా వద్దని సౌజన్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. విజయభాస్కర్ పై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Facebook, Online fraud, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు