Home /News /crime /

WIFE COMPLAINS TO SP ABOUT CONSTABLE HUSBAND BEING TORTURED IN SANGAREDDY DISTRICT SNR

Telangana: నేను పోలీస్‌ని నన్నెవరేం చేయలేరు..భార్యను టార్చర్‌ పెడుతున్న కానిస్టేబుల్

(పెళ్లాన్ని వేధిస్తున్నపోలీస్)

(పెళ్లాన్ని వేధిస్తున్నపోలీస్)

Telangana:పోలీస్‌ని అనే పొగరుతో పెళ్లాం, పిల్లల్ని టార్చర్ పెట్టాడు. ఇదేంటని భార్య ప్రశ్నిస్తే ..క్యారెక్టర్‌ బ్యాడ్ అని వదిలించుకోవాలని ట్రై చేశాడు. తిండి, తిప్పలకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న కానిస్టేబుల్‌పై కడుపు మండిన భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

ఇంకా చదవండి ...
    (K.Veeranna,News18,Medak)
    నేరస్తులు, తప్పు చేసిన వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఓ పోలీసు(Police) కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లల పట్ల కర్కశుడిగా మారాడు. 13ఏళ్లు కాపురం చేసి..ముగ్గురు పిల్లల్ని కనిచ్చిన భార్యకు వివాహేతర సంబంధం(Extramarital affair)అంటగట్టి వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. యముడిలా మారిన మొగుడు నుంచి రక్షణ కల్పించమని కానిస్టేబుల్‌(Constable)‌ పెడుతున్న టార్చర్(Torture)తట్టుకోలేక ఆ వివాహిత చివరకు జిల్లా పోలీస్‌ బాస్‌కి ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి(Sangareddy)జిల్లా కొండాపూర్(Kondapur)మండలం సైదాపూర్‌(Saidapur) గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహులు (Baindla narsimhulu)సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్‌కి భార్య, ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. నర్సింహులు భార్య జ్యోతి (Jyothi)తన ముగ్గురు పిల్లలను తీసుకొని జిల్లా ఎస్పీ ఆఫీస్‌ ముందు నిరసన చేపట్టింది.

    మొగుడు కాదు యముడు..
    13ఏళ్ల క్రితం అంటే 2009 జూన్‌ 27న జ్యోతిని నర్సింహులు వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో రెండు లక్షల నగదు, ఓ బైక్‌ కట్నంగా ఇచ్చారు. ముగ్గురు సంతానం కలిగిన తర్వాత నర్సింహులు ఇంట్లో భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా..వేధించడం మొదలుపెట్టాడని బాధితురాలు వాపోయింది. ఇంట్లో ఖర్చులకు, పిల్లల ఫీజులకు డబ్బులు ఇవ్వమంటే వివాహేతర సంబంధం అంటగట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పిల్లలతో కలిసి ఎస్పీ ఆఫీస్‌ ముందు భర్త బండారాన్ని బయటపెట్టింది.

    భార్యను వదిలించుకునేందుకు ప్లాన్..
    కానిస్టేబుల్ నర్సింహులు గతంలో కూడా ఓ సారి భార్య జ్యోతిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. పిల్లల ఫీజులకు డబ్బులు అడిగితే ఒక్క పైసా ఇవ్వనని తాను పోలీస్‌ని అని ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ బెదిరించాడంటుంది. అంతే కాదు తాను వెళ్లిపోతే వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాధితురాలు జ్యోతి చిత్రపూర్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చానని అయినా న్యాయం జరగక పోవడంతో చివరకు న్యాయం చేయమని జిల్లా ఎస్పీ ఆఫీస్‌ ముందు భైటాయించింది. కానిస్టేబుల్‌ భర్త పెడుతున్న అరాచకాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జ్యోతి మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది.

    న్యాయపోరాటం..
    మీడియాతో జ్యోతి తన బాధ చెప్పుకున్నట్లు తెలుసుకున్న ఎస్పీ ఎస్పి ఎం.రమణకుమార్ బాధితురాలు జ్యోతిని పిలిపించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్‌ను స్వీకరించారు.
    ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వ డంతో జ్యోతి నిరసన విరమించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తూ భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడనే ఆరోపణలపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Extramarital affairs, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు