హోమ్ /వార్తలు /క్రైమ్ /

Variety case: రోడ్డు యాక్సిడెంట్‌లో కొడుకు మృతి భర్తపై కేసు .. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా

Variety case: రోడ్డు యాక్సిడెంట్‌లో కొడుకు మృతి భర్తపై కేసు .. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana | accident : ఆ వివాహితురాలు చేసింది తప్పో లేక ఒప్పో ఎవరికి అర్ధం కావడం లేదు. భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా బంధువుల ఫంక్షన్‌కి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఊహించని దుర్ఘటన జరిగింది. అందుకు తన భర్తే కారణమంటూ ఏకంగా తాళి కట్టి కలిసి సంసారం చేస్తున్న భర్తపైనే పోలీస్ కేసు పెట్టింది. ఈ విచిత్రమైన కేసు వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...

ఆమె  చేసింది తప్పో లేక ఒప్పో ఎవరికి అర్ధం కావడం లేదు. భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా బంధువుల ఫంక్షన్‌కి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఊహించని దుర్ఘటన జరిగింది. అందుకు తన భర్తే కారణమంటూ ఏకంగా తాళి కట్టి కలిసి సంసారం చేస్తున్న భర్తపైనే పోలీస్ కేసు పెట్టింది. ఈ విచిత్రమైన కేసు వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వెరైటీ కేసు..

రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే ట్రాఫిక్ పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని జనం మాత్రం అవేమి పట్టించుకోరు. చేతిలో కారో , బైకో ఉంటే చాలు..మనల్ని మించిన స్పీడ్ డ్రైవింగ్ ఎవరూ చేయలేరన్నంత ధీమాగా డ్రైవ్ చేస్తారు. అలాగని స్పీడ్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. స్వయాన అతని భార్యే దోషిగా చూపిస్తూ పోలీస్ కేసు పెట్టింది. వికారాబాద్(Vikarabad)జిల్లా శంకర్‌పల్లి(Shankarpalli)మండలంలోని కచ్చిరెడ్డిగూడ(Kachchireddyguda)గ్రామ శివార్లలో ఓ కారు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవింగ్‌ చేస్తున్న రహీం(Raheem)తో పాటు అతని భార్య రేష్మా(Reshma), 13ఏళ్ల కూతురు అశ్యూబేగం(Ashubegam), 10సంవత్సరాల వయసున్న కొడుకు రెహమాన్‌(Rahman)‌ ఉన్నారు. కారు శంకర్‌పల్లి నుంచి వస్తున్న సమయంలో కచ్చిరెడ్డి మూల మలుపు దగ్గర పల్టీ కొట్టి బోల్తా పడింది. కారులో డోర్‌ (Car accident)పక్కన కూర్చున్న పదేళ్ల రెహమాన్‌ కారులోంచి కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి స్పాట్‌లోనే మృతి(Spot Died ) చెందాడు. రహీం భార్య రేష్మా, కూతురు అశ్యూకు స్వల్ప గాయాలయ్యాయి.

తప్పు చేస్తే భర్తైతే ఏంటీ..

ఈ దుర్ఘటనతో రహీం, రేష్మా దంపతులు తమ బిడ్డను కోల్పోయారు. జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రేష్మా బిడ్డ చావుకు తన భర్తే కారణమని అంటోంది. కారు వేగంగా నడపటం వల్లే స్పీడ్ కంట్రోల్‌ కాకపోవడం వల్ల టర్నింగ్ దగ్గర బోల్తా కొట్టిందని..ఆ ప్రమాదంలో తన బిడ్డ చనిపోయాడని భర్తపై పోలీస్‌ కేసు పెట్టింది. భర్త రహీం నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేయడం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కట్టుకున్న వాడిపైనే పోలీస్ కేసు..

రహీం, రేష్మా దంపతుల స్వగ్రామం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఎల్లకొండ గ్రామం. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో అక్కడి నుంచి ఇద్దరు బిడ్డలతో కలిసి కారులో ఫంక్షన్‌కి వెళ్లారు దంపతులు. అంత వరకు బాగానే ఉంది. ఫంక్షన్ ముగియగానే ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో వస్తున్న సమయంలోనే కారు యాక్సిడెంట్‌కు గురైంది. ప్రమాదంలో రేష్మా బిడ్డను కోల్పోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్ల ముందే కారు ప్రమాదంలో చనిపోవడం చూసి తట్టుకోలేకపోయిన రేష్మా తన భర్త అతివేగంగా కారు నడపడటం వల్లే చనిపోయాడని పోలీస్ కేస్ పెట్టింది. ఓ వైపు బిడ్డను పోగొట్టుకున్న రహీంపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు రాబడుతున్నారు. బిడ్డ చనిపోయాడన్న బాధలో కట్టుకున్న భర్తపైనే రేష్మా కేసు పెట్టిందన్న వార్త స్థానికంగానే కాదు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది..

First published:

Tags: Police Case, Road accident, Vikarabad

ఉత్తమ కథలు