Home /News /crime /

WIFE COMMITTED SUICIDE AT HOME AFTER BEING HARASSED BY HER HUSBAND VB

Wife And Husband: పెళ్లైన తర్వాత భార్య ముందే.. గర్ల్ ఫ్రెండ్స్ తో ఆ పని చేస్తున్నాడు..! భార్య ఏం చేసిందో తెలుసా..

సూర్యవంశ్ మరియు ఆంచల్ (ఫైల్)

సూర్యవంశ్ మరియు ఆంచల్ (ఫైల్)

Sad: వాళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది కాదా.. అంతే కాకుండా వాళ్లు ఓ పెద్దయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ మీరు అనుకుంటున్నట్లు వాళ్లు ప్రస్తుతం అంత సంతోషంగా లేరు. అంతే కాదు.. అందులో ఒకరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  అక్కడ కనిపిస్తున్న ఇద్దరు దంపతులు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఎంత అంటే.. ఊహించని రీతిలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఊహించని రీతిలో అంటే.. మీరు ఊహించే ఉంటారు.. వాళ్లు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కాదని. అవును.. వారు ఇద్దరు ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తులు. తల్లిదండ్రుల ఒప్పందంతో.. అగ్నిసాక్షిగా మూడుముళ్లతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం వాళ్ల జీవితం కూడా.. లగ్జరీగానే సాగింది. దానికి తోడు సంవత్సరం తర్వాత ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. అప్పటినుంచి ఇక వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఎడ్డెం అంటే.. తెడ్డెం అనడం మొదలు పెట్టేశారు. ఏ విషయంలో కూడా వీళ్లిద్దరు ఒకే విధంగా స్పందించలేకపోతున్నారు.

  అతడు సంతోషంగా వదిన ఇంటికి వెళ్లాడు.. చెప్పాల్సింది చెప్పేశాడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..


  ఒకరికి ఒకటి ఇష్టం అయితే.. మరొకరు వేరేది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అతడికి బయట మహిళలతో అక్రమసంబంధాలు మొదలు పెట్టేశాడని.. అందుకే ఇంట్లో ఉన్న తనతో మంచిగా ప్రవర్తించడం లేదంటూ.. ఆమె ఆరోపణలు చేసింది. ఇలా ఓ రోజు అతడిని నిలదీసింది. నన్నే అనుమానిస్తావా.. ఆ బుద్ధి నీకు అంటది.. నాకు కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటి వరకు చిన్న చిన్న గొడవలు జరగ్గా ఆ క్షణం నుంచి గొడవలు పెద్దగా తయ్యారయ్యాయి. భార్యపై అతడు విపరీతమైన కోపంతో ఉన్నాడు. వేధింపులకు గురి చేసేవాడు. దీనిలో భాగంగానే ఆమె మనస్థాపానికి గురై .. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

  Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


  కాన్పూర్ కు చెదిన సూర్యవంశ్ అనే యువకుడు ఆంచల్ కర్బందా అనే యువతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరివురి కుటుంబాలు ధనవంతులు కావడంతో పెళ్లి అమోఘంగా చేశారు. మొదటి సంవత్సరం వరకు అత్తింటికి భర్త, భర్త ఇంటికి భార్య తల్లిదండ్రులు ఇలా రాకపోకలు బాగానే సాగించారు. ఇలా సంవత్సరం గిర్రున తిరిగింది. ఒక ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇలా పెళ్లి జరిగిన మొదటి సంవత్సరంలో భర్త కోసం కొందరు యువతులు ఇంటికి వస్తుండేవారు. వాళ్లు ఎవరు అని ప్రశ్నించినప్పుడు.. ఫ్రెండ్స్ అని అతడు చెప్పేవాడు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె వాళ్లు ఇలా ఇంటికి రావడాన్ని సహించలేకపోయింది.

  MLC Elections: రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీ మారితే ఇలా చేస్తారా.. ఈ సారి తాడో పేడో తేలాల్సిందే..


  వాళ్లతో చనువుగా మాట్లాడుతుంటే చూడలేకపోయింది. ధైర్యం చేసి ఓ రోజు అతడిని నిలదీసింది. దీంతో సూర్యవంశ్, అతడి తల్లిదండ్రులు ఆంచల్‌ను వేధించడం ప్రారంభించారు. ఇలా సంవత్సరం నుంచి ఇద్దరి మధ్య గొడవలు చినికిచినికి గాలివానగా మారాయి. అయితే భర్త మాత్రం తనను ఇలా నిందించడం తట్టుకోలేకపోయాడు. భార్యను విపరీతంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆమెను శారీరకంగా హింసిస్తూ ఇంట్లోనే బంధీని చేశారు. ఇలా ఓ రోజు ఆంచల్ తన తల్లిదండ్రులకు జరిగిన విషయాలను చెప్పింది. తాను ఇక ఈ వేధింపులకు భరించలేను అని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.

  Farmers: రోడ్డెక్కిన రైతన్నలు.. ఆ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..


  కాంగారు పడిపోయిన వాళ్లు.. హుటాహుటిన ఆంచల్ ఇంటికి వచ్చేశారు. అయితే వారు వచ్చే సరికే ఆంచల్ ఉరేసుకుని చనిపోయింది. ఆమె శవం పక్కనే తన కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. ఇది జరగ్గానే సూర్యవంశ్, అతడి తల్లిదండ్రులు ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై ఆంచల్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగానే పరారయిన సూర్యవంశ్, అతడి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. వాళ్లను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలో వాళ్లను పట్టుకొని అరెస్టు చేస్తానమని పోలీసులు తెలిపారు
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Uttarapradessh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు