Home /News /crime /

WIFE COMMITTED SUICIDE AFTER HER HUSBAND WAS FOUND DEAD IN CHIKKABALLAPUR SSR

Very Sad: ప్రాణంగా చూసుకునే భర్త.. భర్త కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపించే భార్య.. కానీ విషాదం ఏంటంటే..

సునీత, వెంకటేశ్

సునీత, వెంకటేశ్

చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని ముస్తూర్ గ్రామానికి చెందిన సునీత, వెంకటేశ్ భార్యాభర్తలు. ఒకరంటే ఒకరంటే ప్రాణం. పెద్దలు కుదిర్చిన సంబంధం అయినప్పటికీ ప్రేమికుల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉండేవారు.

    చిక్‌బళ్లాపూర్: ప్రేమించే భార్య దొరకడం అదృష్టం. ప్రాణమిచ్చేంత ప్రేమించే భార్యను పొందిన భర్త కంటే అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. కానీ.. అంతలా ప్రేమించే భార్యను పొందిన ఆ భర్త హత్యకు గురయ్యాడు. ఆ భర్త మరణాన్ని తట్టుకోలేక అతని భార్య కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ తాలూకాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని ముస్తూర్ గ్రామానికి చెందిన సునీత, వెంకటేశ్ భార్యాభర్తలు. ఒకరంటే ఒకరంటే ప్రాణం. పెద్దలు కుదిర్చిన సంబంధం అయినప్పటికీ ప్రేమికుల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉండేవారు. భార్య పుట్టినరోజు దగ్గర నుంచి పెళ్లి రోజు వరకూ వెంకటేశ్ అన్నీ గుర్తుంచుకుని మరీ ఎంతో ఘనంగా జరిపేవాడు. భర్త చూపిస్తున్న ఆ ప్రేమకు సునీత ఫిదా అయిపోయింది. సునీత కూడా అంతే ప్రేమగా భర్తను చూసుకునేది. సంసారం ఇలా సాఫీగా సాగిపోతుండగా.. వెంకటేశ్‌కు తన స్నేహితులతో నెలకొన్న తగాదాలు ఆ భార్యాభర్తలకు ఆనందాన్ని దూరం చేశాయి.

    పాత పగలు పెంచుకున్న వెంకటేశ్ స్నేహితులు అతనిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ పరిణామం సునీత జీవితంలో కల్లోలం రేపింది. ప్రాణంగా చూసుకుంటున్న భర్త మృతిని జీర్ణించుకోలేక పోయింది. భర్తతో గడిపిన రోజులు ఆమెకు నిత్యం గుర్తొస్తుండేవి. వెంకటేశ్‌ను తలుచుకుని సునీత కుమిలిపోయింది. భర్త లేని తన జీవితం వ్యర్థమనుకుంది. క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

    వెంకటేశ్ హత్య కేసులో నిందితులను పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ఇక తన భర్తకు న్యాయం జరగదని సునీత మానసికంగా కుంగిపోయేందుకు కారణమైందని స్థానికులు తెలిపారు. భర్త తలంపులను మర్చిపోయేందుకు సునీత ప్రయత్నించిందని.. కొన్ని రోజులు పనికి కూడా వచ్చిందని.. కానీ ఇంటికి వచ్చాక మళ్లీ ముభావంగానే కనిపించేందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్ హత్యకు గురి కావడం, సునీత ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Husband, Karnataka, Murder, Wife, Wife suicide

    తదుపరి వార్తలు