రాత్రి 10.30 గంటలు.. డ్యూటీ నుంచి తిరిగొచ్చిన భర్త.. ఎన్నిసార్లు పిలిచినా భార్య పలకకపోవడంతో ఇంటి వెనక్కు వెళ్లి కిటికీలోంచి చూస్తే..

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి 10.30 గంటలు. ఆ భర్త పని నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తలుపు కొడితే లోపల నుంచి స్పందన లేదు. భార్యను ఒకటికి పదిసార్లు పిలిచాడు. ఆమె ఫోన్ నెంబర్ కు కూడా డయల్ చేశాడు. ఇంట్లో తన కుమార్తె, కొడుకును కూడా పిలిచాడు. ఎవరి నుంచి స్పందన లేదు.

 • Share this:
  రాత్రి 10.30 గంటలు. ఆ భర్త పని నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తలుపు కొడితే లోపల నుంచి స్పందన లేదు. భార్యను ఒకటికి పదిసార్లు పిలిచాడు. ఆమె ఫోన్ నెంబర్ కు కూడా డయల్ చేశాడు. ఇంట్లో తన కుమార్తె, కొడుకును కూడా పిలిచాడు. ఎవరి నుంచి స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుక ఉన్న కిటికీల్లోంచి తొంగి చూశాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి అతడి వెన్నులో వణుకుపుట్టింది. ఇద్దరు పిల్లలు, తన భార్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది చూసి అతడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి చూశాడు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాలను కిందకు దింపి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  బీహర్ రాష్ట్రంలోని మధుబానీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి అయిదేళ్ల క్రితమే పెళ్లయింది. అతడికి ఓ కొడుకు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఢిల్లీలోని షాకర్ పూర్ పరిధిలో అద్దెకు ఉంటున్నాడు. ఓ రెస్టారెంట్ లో పనిచేస్తూ కుటుంబాన్ని ఆ భర్త పోషిస్తున్నాడు. గురువారం భార్యాభర్తల మధ్య ఓ వాగ్వాదం జరిగింది. తన స్వగ్రామంలో జరుగుతున్న మతపరమైన ఓ వేడుకకు హాజరు కావాలని ఆ భార్య కోరింది. అయితే ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ భర్త దానికి ఒప్పుకోలేదు. కుదరదని తేల్చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇంట్లోనే ఉండండని తేల్చిచెప్పి ఆ భర్త డ్యూటీకి వెళ్లాడు.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులు ఎన్నిసార్లు కొట్టినా లోపల నుంచి స్పందన లేదు. పిల్లలను, భార్యను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ భర్త ఇంటి వెనక్కు వెళ్లి కిటికీలోంచి చూశాడు. గదిలో ఫ్యానుకు ఇద్దరు పిల్లల సహా, భార్య కూడా ఉరి వేసుకుని మరణించిన దృశ్యం అతడికి కనిపించింది. దీంతో వెంటనే పక్కన స్థానికులకు, పోలీసులకు విషయాన్ని చేరవేశాడు. ఆ తర్వాత పోలీసుల సాయంతో తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో ఆమె చేసిన పొరపాటునకు ముగ్గురు మరణించడం, ఆ భర్త ఒంటరిగా మిగిలిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
  ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!
  Published by:Hasaan Kandula
  First published: