కూర బాలేదన్న భర్త... సూసైడ్ చేసుకున్న భార్య...

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime News : సాధారణంగా ఏ భార్య అయినా తను వండిన వంటను... తన భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది. ఆ ఇల్లాలు కూడా అదే కోరుకుంది. కానీ అతను మెచ్చుకోకపోయేసరికి తీవ్ర నిర్ణయం తీసుకుంది.

  • Share this:
సంసారం ఓ సాగరం అంటారు కదా. సంతోషాలతోపాటూ సమస్యలూ ఉంటాయి. సరిదిద్దుకుంటూ సాగితే... సాఫీగా ఉంటుంది. సమస్యల్ని సాగదీసుకుంటే మరింత జఠిలమవుతాయని పెద్దలు చెబుతుంటారు. హైదరాబాద్‌... KPHB నాలుగో ఫేజ్... LIG వెంచర్ 2లోని బ్లాక్ నంబర్-6లో జరిగిందో విషాదం. అక్కడ మనీష్, శారద దంపతులు నివసిస్తున్నారు. మనీష్ కోసం ఆమె రకరకాల వంటలు చేసి పెట్టేది. అయితే కొన్నాళ్లుగా వాళ్లిద్దరి మధ్యా సఖ్యత లేదు. ప్రతి దానికీ ఆమెను ఏదో ఒకటి అంటున్నాడని... ఆమె తన పేరెంట్స్‌కి చెప్పుకొని బాధపడేది. వాళ్లేమో... ఏదో ఆఫీస్ టెన్షన్లలో అలా మాట్లాడి ఉంటాడులే అని సరిపెట్టేవాళ్లు. ఇలా రోజులు గడిచిపోసాగాయి.

తాజాగా శుక్రవారం ఆమె ఇంట్లో రకరకాల కూరగాయలు లేకపోవడంతో... ఉన్న బెండకాయలతో కూర చేసినట్లు తెలిసింది. ఐతే... అప్పటికే ఏవో పనుల బిజీలో ఉన్న అతడు... ఆ బెండకాయలు కాస్త వాడిపోయాయన్న ఫీలింగ్‌తో... ఏంటీ కూర... ఇది నేను తినాలా... దీన్ని తినేకంటే పస్తుండటం బెటర్... ఎప్పుడూ ఇంతే... సరిగ్గా కూర వండటం కూడా రాదు నీకు... అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి వేరే గదిలోకి గట్టిగా తలుపు వేసేశాడని తెలిసింది. ఆ తలుపు సౌండ్‌కి ఉలిక్కి పడిన ఆమె... ఆ తర్వాత తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం.

పెళ్లి తర్వాత ఎన్నో ఊహించుకున్న ఆమె... తన భర్తే సూటిపోటి మాటలతో వేధిస్తుంటే... చివరకు కూర విషయంలో కూడా మనసును గాయపరిచేలా తిడుతుంటే ఆమె తట్టుకోలేకపోయినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపం చెందిన శారద... మనీష్ నిద్రపోతున్న సమయంలో... వేరే గదిలో... చీరను ఫ్యాన్‌కి వేలాడ దీసి... సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేస్తున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?

వైసీపీకి 120... రోజా ఓటమి... ఆ సంస్థ సర్వేలో అంచనాలు ఇవీ...

A=B B=C... A=C... లగడపాటి సర్వేపై ప్రొ.నాగేశ్వర్ ఆసక్తికర కామెంట్స్...

లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?
First published: