విమానంలో తిరుపతి వెళ్దామన్న భార్య.. భర్త ఒప్పుకోకపోవడంతో ఇలా విషాదం నింపి..

అక్టోబర్ 10న చిన్నారి పుట్టు వెంట్రుకలను తిరుపతిలో తీయాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం రద్దయింది. దీంతో కుమార్తెను విమానంలో తిరుపతి తీసుకెళ్లి వెంట్రుకలు తీయిద్దామని ప్రవళిక భర్తను కోరింది.

news18-telugu
Updated: October 18, 2019, 9:29 AM IST
విమానంలో తిరుపతి వెళ్దామన్న భార్య.. భర్త ఒప్పుకోకపోవడంతో ఇలా విషాదం నింపి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బిడ్డ పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయాలని ఆ భార్యాభర్తలు భావించారు. కుటుంబ సభ్యులతో కలిసి రైల్లో తిరుపతి వెళ్లాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల రైలు ప్రయాణం రద్దయింది. దీంతో విమానంలో తిరుపతి వెళ్దామని భార్య భర్తను కోరింది. అందుకు అతను కుదరదన్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆపై తన గదిలోకి వెళ్లిన భార్య.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ప్రవళిక(30),హైదరబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన వెంకటరమణ(38)కి 2014లో వివాహం జరిగింది. ప్రవళిక ఆదిత్యా బిర్లా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు 9 నెలల వయసున్న రిత్విక అనే కుమార్తె ఉంది. అక్టోబర్ 10న చిన్నారి పుట్టు వెంట్రుకలను తిరుపతిలో తీయాలని నిర్ణయించారు. ఇందుకోసం ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయాణం రద్దయింది. దీంతో కుమార్తెను విమానంలో తిరుపతి తీసుకెళ్లి వెంట్రుకలు తీయిద్దామని ప్రవళిక భర్తను కోరింది.అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది.

అప్పటినుంచి ఇద్దరి మధ్య తరుచూ చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. తనకంటే తల్లిదండ్రులు చెప్పినదానికే ఎక్కువ విలువనిస్తున్నాడని ప్రవళిక తరుచూ బాధడపతుండేది. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగొచ్చాక.. ప్రవళిక నేరుగా తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మాట్లాడటం ఇష్టం లేక పడుకుందేమోనని అతను భావించాడు. కానీ మరుసటి రోజు ఉదయం కిటికీలోంచి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు