HOME »NEWS »CRIME »wife caught husband and his girlfriend while eating dosa in car hsn

కారులో ప్రేయసితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. లోపల ఏం చేస్తున్నారో చూసి..

కారులో ప్రేయసితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. లోపల ఏం చేస్తున్నారో చూసి..
ప్రతీకాత్మక చిత్రం

భర్త, ప్రేయసిని తన సోదరుడితో కలిసి ఓ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ సమయంలో ఆ భర్త, అతడి ప్రియురాలు కారులో ఏం చేస్తున్నారో కూడా బయటపడటంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

  • Share this:
    వేరే మహిళ వలలో పడి భార్యను నిర్లక్ష్యం చేసిన భర్తల గురించి వార్తల్లో చదివే ఉండి ఉంటారు. ఆ భార్యలు ధైర్యం చేసి ఆ భర్త బాగోతాన్ని బయటపెట్టిన వీడియోలను కూడా చూసి ఉంటారు. భర్త నిర్వాకాన్ని నేరుగా చూసి కోపం పట్టలేక అతడిని ఉతికిపారేసిన వైరల్ వీడియోలు ఎన్నో నెట్టింట హల్ చల్ చేశాయి. తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. భర్త, ప్రేయసిని తన సోదరుడితో కలిసి ఓ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ సమయంలో ఆ భర్త, అతడి ప్రియురాలు కారులో ఏం చేస్తున్నారో కూడా బయటపడటంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాంద్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    బాంద్రా పరిధిలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, తన భార్యతో తరచుగా గొడవపడుతున్నాడు. దీనికి కారణమేంటా అని ఆ భార్య ఆరా తీస్తే దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో సరైన సమయం కోసం ఓపికగా వేచిచూసింది. ఈ మంగళవారం తన భర్త, ప్రియురాలితో కలిసి గుడికి వెళ్లాడని ఆ భార్యకు తెలిసింది. వెంటనే ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది. అతడితో కలిసి నేరుగా గుడికి వెళ్లింది. గుడికి కాస్త దూరంగా, ఓ టిఫిన్ సెంటర్ కు కాస్త దగ్గరగా తన భర్త కారు పార్క్ చేసి కనిపించింది. ఆ కారు వద్దకు భార్య, ఆమె తమ్ముడు వెళ్లారు.



    అప్పటికే కారులో భర్త, అతడి ప్రేయసి ఉన్నారు. కారులో వారిద్దరూ కలిసి దోశలు తింటున్నారు. కారులో టిఫిన్ చేస్తున్న వారిని ఆ భార్య బయటకు లాగింది. అక్కడే నానా రభస చేసింది. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. అయితే ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేజర్లయిన ఓ స్త్రీ, పురుషుడు కలిసి ఉండటం తప్పు కాదు. కాబట్టి వారిపై కేసు పెట్టకుండా, పోలీసులు ఆ జంటను హెచ్చరించి పంపించేశారు. భార్యను సరిగ్గా చూసుకోవాలంటూ అతడికి హితవు పలికారు. కాగా, ఆ భర్త ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కొత్త కాదట. పలువురు మహిళలతో అతడికి సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరా తీస్తే తెలిసిందంట. అమ్మాయిలతో కలిసి బయట తిరగడం అతడికి సరదా అని భార్యకు తెలిసింది. దీంతో అతడిని పద్దతి మార్చుకోవాలని ఆమె హెచ్చరించడం గమనార్హం. మరి ఆ భర్త తన తీరు మార్చుకుంటాడో.. లేదో.. వేచిచూడాలి.
    Published by:Hasaan Kandula
    First published:January 21, 2021, 08:27 IST