లాడ్జిలో ప్రియురాలితో కానిస్టేబుల్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భార్య

ప్రతీకాత్మక చిత్రం

లాడ్జిలో ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు వారిని అప్పగించింది.

 • Share this:
  అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. పచ్చని కాపురాల్లో కలహాలు రేపుతున్నాయి. భార్య ఉండగా భర్త, భర్త ఉండగా భార్య ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని సంసారాలను నాశనం చేసుకుంటున్న వార్తలు నిత్యం మనం వింటూనే ఉన్నాం. తాజాగా భార్య ఉండగానే వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కథ వెలుగులోకి వచ్చింది. పోలీస్ డిపార్ట్ మెంట్ కావడంతో తనను ఎవరు ఏం చేయలేరు అనుకున్నాడో.. ఏమో.. ఏకంగా లాడ్జిలోనే ప్రియురాలితో సహా దిగాడు. విషయం తెలియడంతో భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు వారిని అప్పగించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. వివరాల ప్రకారం.. చర్ల మండలంలోని అలుబాకకు చెందిన సుభాష్ అనే కానిస్టేబుల్ కి మణుగూరుకు చెందిన ఓ మహిళలతో 2017 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు.  అయితే వివాహం జరిగిన సంవత్సరం తర్వాత నుంచి మరొక మహిళతో సుభాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం సుభాష్ తన ప్రియురాలితో కలిసి భద్రాచలంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో ఉన్నాడని భార్యకు తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. వారిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. అనంతరం వారిని పోలీసులకు అప్పగించింది ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  హోటల్ రూమ్‌లో వేరే వ్యక్తి భార్యతో రాసలీలలు సాగిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం సైతం ఇటీవల బట్టబయలైంది. స్వయంగా ఆ మహిళ భర్తే వారిద్దని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ మహిళ బ్యూటిపార్లర్‌లో పనిచేస్తున్నానని భర్తను నమ్మించింది. అయితే భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.

  ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన తన భార్యను వెంబడించాడు. ఆమె ఏఆర్ కానిస్టేబుల్‌ వంశీతో హోటల్‌కు వెళ్లడాన్ని గుర్తించాడు. హోటల్ వద్దకు వెళ్లిన అతడు తలుపు తట్టాడు. అయితే గొంతు గుర్తుపట్టిన అతని భార్య బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాకుంది. దీంతో అతడు పోలీసుల సమక్షంలో ఆ వ్యక్తి హోటల్ గదిలో తలుపు తెరిచి చూడగా.. అందులో వంశీతో పాటు అతని భార్య ఉన్నారు. దీంతో పోలీసులు వంశీతోపాటు ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, ఉద్యోగం ఆశ చూపి ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యను లోబరుచుకున్నాడని ఆ మహిల భర్త ఆరోపించాడు. పోలీసు శాఖలో పనిచేస్తూ ఇలాంటి పాడుపని చేస్తున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అతడు డిమాండ్ చేశాడు.
  Published by:Nikhil Kumar S
  First published: