బెడ్రూమ్‌లో మరో మగాడితో భర్త శృంగారం... చూసిన భార్య తట్టుకోలేక

ఓ రోజు ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. అయితే, తన దగ్గర ఉన్న తాళం చెవితో ఇంటి డోర్ ఓపెన్ చేసుకుని లోపలకు వెళ్లింది.

news18-telugu
Updated: February 23, 2020, 7:44 PM IST
బెడ్రూమ్‌లో మరో మగాడితో భర్త శృంగారం... చూసిన భార్య తట్టుకోలేక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బెడ్రూమ్‌లో తన భర్త మరో మగాడితో శృంగారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తమామలకు కంప్లెయింట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడికి, హెచ్ ఆర్ మేనేజర్‌గా జాబ్ చేస్తున్న యువతిలో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినా పడకగదిలో అతడు ఆమెతో శృంగారంలో పాల్గొనడం లేదు. పైగా తనను దూరం పెడుతూ వచ్చాడు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక ఆమె మనోవేదన చెందుతోంది. మరోవైపు పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదంటూ బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెను ప్రశ్నించేవారు. అయితే, అసలు విషయం చెప్పడానికి ఆమె మొహమాటపడేది.

తాజాగా, ఓ రోజు ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. అయితే, తన దగ్గర ఉన్న తాళం చెవితో ఇంటి డోర్ ఓపెన్ చేసుకుని లోపలకు వెళ్లింది. అయితే, బెడ్రూంలో నుంచి శబ్దాలు రావడంతో బెడ్రూం డోర్ తీసి చూసింది. అక్కడ జరుగుతున్నది చూసి షాక్‌కు గురైంది. బెడ్రూంలో తన భర్త మరో యువకుడితో శృంగారం చేస్తుండగా చూసి ఆమెకు కోపం నషాళానికి ఎక్కింది. అయితే, ఆమె భర్త వెంటనే తేరుకుని, ఎదురుదాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. ఆమె మీద దాడి చేశారు. తప్పు చేసిన భర్త మళ్లీ తననే కొట్టడంతో ఆమెకు మరింత కోపం వచ్చింది. వెంటనే అత్తమామలను పిలిచి తన భర్త చేసిన నిర్వాకం గురించి ఫిర్యాదు చేసింది. అలాగే, పోలీసులను కూడా ఆశ్రయించింది. తన భర్త తనను కొట్టి, చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 23, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading