హోమ్ /వార్తలు /క్రైమ్ /

బ్యాంక్ ఉద్యోగిని చితకబాదిన మహిళ.. ఆమె ఎవరో.. అతడిని ఎందుకు కొట్టిందో తెలిస్తే..

బ్యాంక్ ఉద్యోగిని చితకబాదిన మహిళ.. ఆమె ఎవరో.. అతడిని ఎందుకు కొట్టిందో తెలిస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అదొక బ్యాంకు. పదుల సంఖ్యలో ఉద్యోగులు, కస్టమర్లతో చాలా బిజీగా ఉంది. ఇంతలో ఓ మహిళ ఆగ్రహంతో కేకలు పెట్టుకుంటూ వచ్చింది. ఓ బ్యాంకు ఉద్యోగిని పట్టుకుని కొట్టసాగింది. అతడి గల్లా పట్టుకుని సీటు నుంచి బయటకు లాక్కొచ్చింది. బ్యాంకు సిబ్బంది వచ్చి ఆమెకు నచ్చచెప్పినా వినలేదు. అతడిని వదిలి పెట్టలేదు.

ఇంకా చదవండి ...

అదొక బ్యాంకు. పదుల సంఖ్యలో ఉద్యోగులు, కస్టమర్లతో చాలా బిజీగా ఉంది. ఇంతలో ఓ మహిళ ఆగ్రహంతో కేకలు పెట్టుకుంటూ వచ్చింది. ఓ బ్యాంకు ఉద్యోగిని పట్టుకుని కొట్టసాగింది. అతడి గల్లా పట్టుకుని సీటు నుంచి బయటకు లాక్కొచ్చింది. బ్యాంకు సిబ్బంది వచ్చి ఆమెకు నచ్చచెప్పినా వినలేదు. అతడిని వదిలి పెట్టలేదు. ఇంతకీ అతడికి, ఆమెకు సంబంధం ఏంటనే కదా మీ డౌటు. ఆమె స్వయానా అతడు తాళి కట్టిన భార్య. అవును, భార్య చేతుల్లోనే అతడు చావు దెబ్బలు తిన్నాడు. అతడు చేసిన ఓ తప్పునకు ఆమె నేరుగా బ్యాంకుకే వచ్చి తనకు నచ్చిన స్టైల్లో శిక్షించి పారేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వరంగల్ నగరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి పోచమ్మ మైదాన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వారి పదేళ్ల కాపురానికి గుర్తుగా ఓ పాపకూడా ఉంది. అయితే ఈ మధ్య భార్యను శ్రీనివాస్ నిర్లక్ష్యం చేయసాగాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెను దూరం పెట్టసాగాడు. అసలు కారణమేంటా అని ఆరా తీస్తే షాకింగ్ నిజం బయటపడింది. ఓ మహిళతో అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఆమెతో కలిస వరంగల్ నగరంలోనే మరో చోట ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మరీ సహజీవనం చేస్తున్నాడన్న నిజం బయటపడింది.

దీంతో ఆ భార్య శివంగిలా మారింది. వాళ్లు ఉంటున్న ఇంటికి వెళ్లకుండా మంగళవారం నేరుగా భర్త పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్లింది. భర్త వద్దకు సరాసరి దూసుకెళ్లింది. తనతో ఏదో మాట్లాడి వెళ్లిపోతుందిలే అని శ్రీనివాస్ అనుకున్నాడు. కానీ అతడు ఊహించని రీతిలో ఆమె విరుచుకుపడింది. అతడి గల్లా పట్టుకుని నిలదీసింది. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావ్, అదెవరు.? అంటూ నానా మాటలు అన్నది. తన ఆక్రోషాన్నంతా తీర్చుకుంది. అతడి గల్లా పట్టుకుని కొట్టింది. దీంతో ఇతర బ్యాంకు సిబ్బంది వచ్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు. అతడిని ఆమె నుంచి రక్షించారు. బ్యాంకులో రచ్చ చేసిన తర్వాత ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తపై కేసు పెట్టింది.

First published:

Tags: Crime news, Crime story, Husband kill wife, Illegal affairs