Wife: భర్త గురించి పచ్చి నిజం తెలిసి.. ఇద్దరు పిల్లలతో కలిసి.. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వెళ్లిందంటే..

పోలీస్ స్టేషన్‌లో పిల్లలతో షాలిని

దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన భారత సైనిక దళంలో ఉద్యోగం చేస్తున్నాడు. బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ భార్యలను మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి తాళి కట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న మూడో భార్యకు భర్త లోగుట్టు తెలియడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన భారత సైనిక దళంలో ఉద్యోగం చేస్తున్నాడు. బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ భార్యలను మోసం చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి తాళి కట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న మూడో భార్యకు భర్త లోగుట్టు తెలియడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భర్తను వెతుక్కుంటూ ఆ వివాహిత పిల్లలను వెంటబెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లింది. తన భర్త మూడో భార్యతో అక్కడే ఉంటున్నట్టు తెలిసి తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులను ఆశ్రయించింది.

    అక్కడికి ఆమె భర్త రావడంతో తనకు జరిగిన మోసాన్ని భరించలేక ఆగ్రహంతో ఊగిపోయింది. తన భర్త మొదటి పెళ్లి గురించి కూడా తనకు తెలియదని.. తనకు తెలియకుండా రెండు పెళ్లిళ్లు చేసుకుని తనను మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మనీష్ శంకర్ అనే వ్యక్తి భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. షాలిని అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. అంతకు క్రితమే అతనికి మోనికా అనే యువతితో వివాహమైంది.

    ఆమెకు తెలియకుండా ఈమెను.. ఈమెకు తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆర్మీలో పనిచేస్తుండటంతో విధులకు వెళుతున్నాడేమోనని రెండో భార్య షాలిని భావించింది. మోనికా అనే మహిళను మనీష్ శంకర్ తొలుత పెళ్లి చేసుకున్నాడు. ఆమె హర్యానాలోని పానిపట్‌లో ఉంటోంది. సెలవులపై వచ్చినప్పుడు కొన్నాళ్లు అక్కడ, కొన్నాళ్లు హైదరాబాద్‌లో షాలినితో ఉంటూ వచ్చాడు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. షాలిని ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి.

    ఇప్పుడు మళ్లీ మనీష్.. చాందినీ అన్సారీ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో కలిసి ఉంటున్నాడని షాలినికి తెలిసి భర్తను వెతుక్కుంటూ మీరట్‌కు వెళ్లింది. అక్కడే మూడో భార్యతో మనీష్ కాపురం పెట్టినట్లు షాలినికి తెలిసింది. ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మూడు పెళ్లిళ్ల ప్రబుద్ధుడి గురించి తెలిసింది.

    ఇది కూడా చదవండి: Very Sad: ఎంతటి విషాదం.. కుప్పకూలిన యువ జవాను కాపురం.. 2019లో పెళ్లి.. ఇంతలోనే..

    తీగ లాగితే డొంక కదిలినట్టు.. మరో పెళ్లి చేసుకున్న తన భర్తను నిలదీద్దామని వచ్చిన షాలినికి తన భర్త మొదటి పెళ్లి గురించి కూడా తెలియడం కొసమెరుపు. తన భర్తపై షాలిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ని తప్పులు చేసిన తన భర్తను ఊరికే వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.

    ‘నువ్వు తగిన మూల్యం’ చెల్లించేంత వరకూ వదిలిపెట్టనని భర్తను షాలిని హెచ్చరించింది. కన్నతల్లికి తండ్రి చేసిన ద్రోహం గురించి తెలుసుకోలేని వయసులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులను చూసి అక్కడున్న వారి కడుపు తరుక్కుపోయింది. ముగ్గురు మహిళలను ఇలా నమ్మించి మోసం చేసిన ఆ ప్రబుద్ధుడిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
    Published by:Sambasiva Reddy
    First published: