భర్త ప్రియురాలితో శృంగారంలో మునిగితేలుతుంటే...భార్య బెడ్రూంలో పెట్రోల్ పోసి...

ఇంద్రాణి ఇంట్లో లేని సమయంలో సుమిత్ తన ప్రియురాలు రోజీతో సరససల్లాపాల్లో మునిగేవాడు. అయితే చుట్టు పక్కల వారు ఇంద్రాణికి ఫిర్యాదు చేయడంతో తన భర్త మరో మహిళతో వివాహేతర బంధంలో ఉన్నాడని గ్రహించింది.

news18-telugu
Updated: November 20, 2019, 10:18 PM IST
భర్త ప్రియురాలితో శృంగారంలో మునిగితేలుతుంటే...భార్య బెడ్రూంలో పెట్రోల్ పోసి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై పెట్రోల్ పోసి ఓ మహిళ హత్యాయాత్నానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని భరత్ పూర్‌లో సుమిత్(పేరు మార్పు) తన భార్య ఇంద్రాణి(పేరుమార్పు)తో కలిసి స్థానిక రాధేశ్యాం నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన సుమిత్ స్థానిక ఆసుపత్రిలో పనిచేసేవాడు. అయితే ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో పనిచేసే రోజీ (పేరుమార్పు)తో చనువుగా ఉండేవాడు. ఆమెతో స్నేహం చివరికి వివాహేతర బంధానికి తెరలేపింది. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. ఇంద్రాణి ఇంట్లో లేని సమయంలో సుమిత్ తన ప్రియురాలు రోజీతో సరససల్లాపాల్లో మునిగేవాడు. అయితే చుట్టు పక్కల వారు ఇంద్రాణికి ఫిర్యాదు చేయడంతో తన భర్త మరో మహిళతో వివాహేతర బంధంలో ఉన్నాడని గ్రహించింది. ఒక రోజు తాను బయటకు వెళ్తున్నానని భర్తకు అబద్ధం చెప్పింది. ఇంతలో సుమిత్ తన ప్రియురాలు రోజీని ఇంటికి వచ్చేయమని ఆహ్వానించాడు. అంతేకాదు ఇద్దరూ కలిసి బెడ్రూంలో దూరి శృంగారం మొదలుపెట్టేశారు. ఇంతలో ఇంద్రాణి తిరిగి వచ్చి కిటికీలో నుంచి చూసింది. తన భర్త సుమిత్, మరో మహిళతో కలిసి సెక్స్ చేస్తుండటం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది. పట్టరాని ఆగ్రహంతో ఒక బాటిల్ లో పెట్రోల్ తీసుకువచ్చి కిటికీలో నుంచి బెడ్రూంలోకి చల్లింది. వెంటనే నిప్పు పెట్టింది.

ఇంకేముంది బెడ్రూంలో మంటలు అంటుకోవడంతో సుమిత్, రోజీలు భయభ్రాంతులై బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశారు. ఇంద్రాణి చుట్టు పక్కల వాళ్లను పిలిచి నగ్నంగా బయటకు వచ్చిన సుమిత్, రోజీలను రెడ్ హ్యాండెడ్‌గా నిలబెట్టింది. ఇద్దరినీ దేహశుద్ధి చేస్తుండగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేయగా, విచారణ కొనసాగుతోంది.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు