Home /News /crime /

WIFE BRUTALLY MURDERED HUSBAND ALONG WITH HER LOVER SHOCKING ILLICIT RELATIONSHIP CASE MISLED POLICE IN RAJASTHAN SK

భర్తను చంపి ఎన్ని డ్రామాలాడింది.. పోలీసులే షాక్.. ఆర్జీవీకి తెలిస్తే మరో క్రైమ్ మూవీ ఖాయం

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

Wife Kills Husband: ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం.. మరుసటి రోజు ఉదయం బాయి దేవి.. టీ తయారు చేసుకొని.. పొలానికి వెళ్లింది. ఇక రోడ్డుపై నడుకుంటూ రాంప్రసాద్ నడుకుంటూ వెళ్తుండగా అక్కడ లక్ష్మణ్ శవం కనిపించింది. దానిని చూసి బిగ్గరగా కేకలు వేశాడు.

ఇంకా చదవండి ...
  ఇటీవల నేరాలు ఘోరాలు పెరిగాయి. చిన్న కారణానికే హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. ప్రియురాలిలో మోజులో భార్యను కడతేర్చిన భర్త.. ఇలాంటి క్రైమ్ స్టోరీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో కూడా ఇలాటి ఘోరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసింది అతడి భార్య. ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎన్నో స్కెచ్‌లు వేసింది. ఆమె క్రిమినల్ మైండ్‌ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. భర్తను ఎలా చంపింది? ఆ తర్వాత ఏమేం స్కెచ్‌లు వేసింది? చివరకు ఎలా దొరికారో .. ఇక్కడ తెలుసుకుందాం.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా బనేతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాయి దేవి, లక్ష్మణ్ జాట్ భార్యా భర్తలు. పెళ్లై చాలా ఏళ్లయింది. కొన్నాళ్ల పాటు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత బాయి దేవి దారి తప్పింది. ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అదే ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ జాట్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం సాగుతోంది. ఐతే ఇలా ఎన్నాళ్లు.. చాటుమాటుగా కలుసుకోవాలని.. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ ఆమెకు ఇప్పటికే భర్త ఉన్నాడు. అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. భర్తను చంపేసి.. ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే భర్తను చంపేందుకు పక్కగా ప్లాన్ చేసింది.

  మిత్రుడని నమ్మి కేఫ్‌కి వెళ్లింది..అప్పటి నుంచి రోజూ నరకం..వీడియో చూపించి నిత్యం అత్యాచారం

  ఈ క్రమంలో సోమవారం ఇంట్లో నిద్రపోతున్న లక్ష్మణ్‌ను బాయి దేవి, రాంప్రసాద్ కలిసి హత్య చేశారు. తలపై బండరాయితో కొట్టి.. చంపేశారు. ఆ తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానా కష్టాలు పడ్డారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు లక్ష్మణ్ మృతదేహాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి.. రాత్రివేళ ఓ రోడ్డు పక్కన పడేశారు. లక్ష్మణ్ పొలానికి వెళ్లాలంటే ఆ రోడ్డు మీదుగానే వెళ్లాలి. రాత్రి పొలానికి వెళ్లుండగా బైక్ కింద పడి.. తల పగిలి.. లక్ష్మణ్ చనిపోయాడని.. నమ్మించాలి. అదే వీరి పథకం. అనుకున్నట్లుగానే రోడ్డు పక్కన శవాన్ని విసిరేశారు. బైక్‌ను ధ్వంసం చేసి..రోడ్డు పక్కన పడేశారు. ఆ తర్వాత ఎవరి కంటా పడకుండా.. అర్ధరాత్రి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

  Guntur Crime Story: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. అంతా పక్కాగా చేశారు.. చివరకు

  ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం.. మరుసటి రోజు ఉదయం బాయి దేవి.. టీ తయారు చేసుకొని.. పొలానికి వెళ్లింది. ఇక రోడ్డుపై నడుకుంటూ రాంప్రసాద్ నడుకుంటూ వెళ్తుండగా అక్కడ లక్ష్మణ్ శవం కనిపించింది. దానిని చూసి బిగ్గరగా కేకలు వేశాడు. లక్ష్మణ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని.. స్పృహ తప్పి పడిపోయాడని చెప్పాడు. అతడి కేకలు విని చుట్టు పక్కల ప్రజలు వచ్చారు. విషయం తెలిసి బాయి దేవి కూడా అక్కడికి చేరుకుంది. లక్ష్మణ్ కోసమే టీ తీసుకొని పొలానికి వెళ్లానని.. కానీ అక్కడ అతడు కనిపించలేదని చెప్పి ఏడ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ముందు ప్రమాదమే అనుకున్నారు. కానీ బైక్‌ పడి ఉన్న తీరు.. లక్ష్మణ్ శరీరంపై ఉన్న గాయాలను చూసి అనుమానం వచ్చింది.

  Student murder : కాలేజీ స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు.. కక్షతో ఒకరి హ

  ముందుగా దీని గురించి ఎవరు బయటకు చెప్పారని స్థానికులను అడిగారు. రాంప్రసాద్ పేరు చెప్పడంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. అనేక ప్రశ్నలు వేశారు. రాంప్రసాద్ పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం పెరిగింది. తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. లక్ష్మణ్ భార్య, తాను కలిసి అతడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భర్తను చంపి.. ఎన్ని బాయిదేవి ఎన్ని కట్టుకథలు చెప్పిందని..స్థానికులతో పాటు పోలీసులు కూడా షాక్ తిన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Illicit relationship, Murder, Rajasthan

  తదుపరి వార్తలు