ప్రియుడితో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. దాడిలో గాయాలపాలై..

వారిద్దరు ఏకాంతంగా గడుపుతుండటాన్ని కళ్లారా చూసిన జయరాముడు.. బయటినుంచి గడియ పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియుడితో కలిసి జ్యోతి జయరాముడిపై దాడి చేసింది.

news18-telugu
Updated: August 29, 2019, 12:42 PM IST
ప్రియుడితో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. దాడిలో గాయాలపాలై..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 29, 2019, 12:42 PM IST
వివాహేతర సంబంధాలు.. దాడులు,హత్యలకు దారితీస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవయ్య నగర్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సందర్భంలో భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో.. ఇద్దరు కలిసి అతనిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. సంజీవయ్యనగర్‌లో జయరాముడు-జ్యోతి అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జ్యోతికి రాము అనే యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటినుంచి భర్తకు తెలియకుండా జ్యోతి రాముతో సంబంధం నడుపుతోంది. భర్త ఇవేమీ పసిగట్టకపోవడంతో.. ఒకరోజు రామును నేరుగా ఇంటికే పిలిపించుకుంది.అయితే సరిగ్గా అదే సమయానికి జయరాముడు పొలం నుంచి ఇంటికి రావడంతో గుట్టు రట్టయింది. వారిద్దరు ఏకాంతంగా గడుపుతుండటాన్ని కళ్లారా చూసిన జయరాముడు.. బయటినుంచి గడియ పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియుడితో కలిసి జ్యోతి జయరాముడిపై దాడి చేసింది. తలపై కర్రతో బాదడంతో రక్తస్రావంతో అతను కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...