Telangana Crime News: భార్య, కొడుకు గొంతు కోసిన భర్త.. తప్పించుకున్న కూతురు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime News: కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడ్డారు. కొంతమంది కుటుంబపోషణ భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా , లాక్ డౌన్ కారణంగా అతడికి ఉపాధి పోయింది. కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. కానీ లాక్ డౌన్ ఎత్తెయడంతో మళ్లీ ఉపాధి దొరికింది. కానీ చేసిన అప్పులను మాత్రం తీర్చలేకపోయాడు. పిల్లల చదువులకు ఫీజులు కట్టే స్థోమత లేక, చేసిన అప్పులు తీర్చలేక అతడు ఆవేదన చెందాడు. చివరకు అతడు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాడు. అంతకంటే ముందే తన భార్యను, పిల్లలను చంపేసి.. తాను ఆత్మహత్య చేసకుందామని అనుకున్నాడు. తెల్లావారుజామున మొదట తన భార్యను కత్తితో గొంతు కోసి.. తర్వాత తన కుమారుడి గొంతు కోశాడు. తర్వాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తన కూతురు మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

    వరంగల్ అర్బన్ (హన్మకొండ) జిల్లా పైడిపెల్లి గ్రామానికి చెందిన జన్ను చిన్న అతడి భార్య శోభ, ఇద్దరు పిల్లలు కొడుకు జయవర్దన్(8), కూతురు(7) జీవనం సాగిస్తన్నారు. అతడు తన ఉద్యోగరీత్యా ఏడాది నుంచి కుటుంబంతో కలిసి వరంగల్‌లోని కాకతీయ కాలనీలో అద్దెకుంటున్నాడు. హన్మకొండ చౌరస్తాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా లాక్‌డౌన్‌తో అతడికి ఆ కొలువు పోయింది. దీంతో కుటుంబపోషణ కోసం అతడు అప్పులు చేయాల్సి వచ్చింది. ఇటీవల తిరిగి పనిలో చేరినా కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చడం ఆయనకు కష్టమైంది.దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో పాటు అతడి భార్య, పిల్లలను చంపి తాను చనిపోవాలని అనుకున్నాడు.

    తెల్లవారుజామున 5 గంటలకు చిన్న, ఇంట్లో కరెంట్‌ సరఫరా నిలిపివేశాడు. తొలుత కత్తితో భార్య శోభ, కొడుకు జయవర్దన్‌ గొంతు కోశాడు. ఆ తర్వాత తన గొంతును కోసుకుని కుమార్తె కోసం వెతికాడు. అయితే ఆ పాప భయంతో బయటకు పరుగులు తీసి.. డాడీ మమ్మల్ని చంపేస్తున్నాడు అంటూ పెద్దగా అరిచింది. చుట్టుపక్కలవారు ఇళ్లలోంచి వచ్చి చూడగా ముగ్గురూ తెగిన గొంతులతో కిందపడి కనిపించారు. ముగ్గురూ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు చిన్న చెప్పాడు.
    Published by:Veera Babu
    First published: