Home /News /crime /

WIFE AND HUSBAND SEXUALLY HARASSING TOW YOUNG SISTERS IN KAKINADA OF EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: అక్కాచెల్లెళ్లకు ఆశ్రయమిచ్చిన అంకుల్... కొన్నేళ్ల తర్వాత ఆంటీతో కలిసి.. ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లిద్దరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అతడు.. కీచకుడిగా మారాడు. తన రెండో భార్యతో కలిసి యువతులను వేధించడం మొదలుపెట్టాడు.

    వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు.. చదువుల్లో సరస్వతులు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా వేరే ప్రాంతంలో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఐతే వారి ఆర్ధికస్థితి అంతగా బాగోలేకపోవడంతో సొంతగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉండలేని పరిస్థితి. దీంతో ఓ తెలిసిన వ్యక్తి తాను ఆశ్రయమిస్తానని వాళ్లిద్దరినీ తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. పదేళ్లపాటు చాలా నమ్మకంగా చూసుకున్నాడు. ఐతే వారిపట్ల మంచితనంతో వ్యవహరించాల్సిన వాడు క్రమంగా కట్టుతప్పాడు. వారిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడికి భార్యకూడా సహకరించడం గమనరార్హం. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు.. కాకినాడ అశోక్ నగర్ కు చెందిన రాజేశ్వర్ దయాళ్, రెండో భార్య స్వాతి వద్ద దాదాపు పదేళ్లుగా ఉంటున్నారు. అక్కడే ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. ఐతే తొలుత వారితో బాగానే ఉన్న రాజేశ్వర్ దయాళ్.. క్రమంగా వారిని వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని లేకుంటే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.

    ఈ విషయాన్ని ఆ యువతులు అతడి భార్య స్వాతికి చెప్పినా.. సదరు మహిళ భర్తకే మద్దతిచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ ఆ యువతులను నిత్యం వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు ఇద్దర్నీ బలవంతం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన బాధితులు వారి బారి నుంచి తప్పించుకొని స్వగ్రామానికి పారిపోయారు. వీరిలో ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది చదవండి: శనివారం చికెన్, మటన్ తెచ్చిన భర్త.., ఈ రోజు కాదు రేపు అన్న భార్య.. అంతలోనే ఘోరం..


    మంచివాడని నమ్మితే పరిచయస్తుడే కీచకుడిగా మారాడని బాధితురాళ్లు చెప్తున్నారు. చంపేస్తామని బెదిరించడంతోనే ఇన్నాళ్లూ భరించామని., ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో తప్పించుకొని పోలీసులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమ పేదరికాన్ని అవసరాన్ని ఆసరాగా చేసుకొని లోబరుచుకోవాలని చూశాడని.. లొంగకపోయే సరికి చంపేస్తానంటూ బెదిరించాడని వారు వాపోయారు. ప్రతి రోజూ ఇలాంటి వారి నుంచి మహిళలు లైంగిక వధింపులు ఎదుర్కంటున ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా నిందితులు బెయిల్ పై బయటకిరావడం మళ్లీ వేధింపులకు పాల్పడటం వంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కేసులో యువతుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Harassment on women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు