WIFE AND HUSBAND DIED IN ROAD ACCIDENT IN PATANCHERU SANGAREDDY DISTRICT VB MDK
Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. విధులు ముగించుకొని వస్తుండగా దంపతులను వెంటాడిన మృత్యువు.. అనాథగా మారిన రెండేళ్ల బాబు..
ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో దీపిక
Road accident: విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న వీరు కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా పట్టణంలోని శ్రీనగర్ వెళ్లే కూడలి సమీపంలో వారిని టిప్పర్ ఢీ కొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోగా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది.
విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న వీరు కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా పట్టణంలోని జాతీయ రహదారిపై శ్రీనగర్ వెళ్లే కూడలి సమీపంలో వారిని టిప్పర్ ఢీ కొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆమె కూడా మృతిచెందింది. పూర్తి వివరాలు.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం దద్దోజిపేటకు చెందిన శ్రీధర్ (34)కు జగిత్యాల జిల్లా కోరట్ల కు చెందిన దీపిక( 28) నాలగేళ్ల క్రితం పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. వారి ఉద్యోగ రీత్యా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని శాంతి నగర్ లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి నిత్యం ఇరువురు విధులకు వెళ్లేవారు. భర్త శ్రీధర్ స్థానిక మైలాన్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తుండగా.. భార్య దీపిక టెక్ మహింద్రాలో సాఫ్ట్ వేర్ లో ఉద్యోగి గా పనిచేస్తున్నారు.
పెళ్లైన కొన్ని రోజులకు వారికి బాబు పుట్టాడు. అన్యోన్యంగా దాంపత్య జీవితం సాగిపోతుండగా విధి ఒక్కసారి వెక్కిరించింది. ఇద్దరు విధులు ముగించుకొని తిరిగి తన కాలనీ కి వస్తుండగా టిప్పర్ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది.
ఘటనా స్థలంలో శ్రీధర్ ( 34) మృతదేహం
ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా దీపిక ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చినిపోయింది. దీంతో రెండు సంవత్సరాల బాలుగు అనాథగా మారాడు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.