WIFE AND HUSBAND DIED IN ROAD ACCIDENT IN HYDERABAD LEADS TO THREE YEAR OLD BOY LEFT AS AN ORPHAN FULL DETAILS HERE HSN
Hyderabad: నాలుగేళ్ల క్రితం పెళ్లి.. మరదలు కూడా వాళ్లింట్లోనే ఉంటూ సాఫ్ట్ వేర్ జాబ్.. పనుందని భార్యను బయటకు తీసుకెళ్లి..
రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యాభర్తలు
ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. హైదరాబాద్ లోనే కాపురం పెట్టాడు. భార్యాభర్తలిద్దరికీ మంచి జాబ్స్. మరదలు కూడా వచ్చి వాళ్లతోనే ఉంటూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. కానీ ఇంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది.
‘ఒక గంటలో తిరిగి వచ్చేస్తాం. ఈ లోపు బాబును చూసుకో..’ అంటూ మరదలికి చెప్పి తన భార్యతో కలిసి బైక్ పై బయటకు వెళ్లాడో భర్త. బయట పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరారు. కొద్ది దూరం అయితే ఇంటికి చేరుకుంటామనగా ఘోరం జరిగింది. మితిమీరిన వేగంతో వస్తున్న ఓ టిప్పర్ ఆ భార్యాభర్తలు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఆ భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడేళ్ల బాబును అనాథను చేసి ఆ తల్లిదండ్రులిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పెళ్లయిన నాలుగేళ్లకే ఆ జంటకు నిండునూరేళ్లు నిండిపోయాయి. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం దద్దోజిపేటకు చెందిన 34 ఏళ్ల శ్రీధర్ హైదరాబాద్ లో మైలాన్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితమే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 28 ఏళ్ల దీపికతో పెళ్లయింది. దీపిక టెక్ మహీంద్రాలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. వీరిద్దరికీ మూడేళ్ల హనీష్ అనే బాబు ఉన్నాడు. దీపిక సోదరి కూడా హైదరాబాద్ లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ వాళ్లింట్లోనే ఉంటోంది. అందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగానూ, కుటుంబంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యీపీగా ఉంటున్న తరుణంలో ఊహించని ఘోరం జరిగింది.
శనివారం సాయంత్రం పనుందని చెప్పి గంటలో వస్తామని, అప్పటి వరకు బాబును చూసుకోమని మరదలికి చెప్పి అతడు తన భార్యను తీసుకుని బయటకు వెళ్లారు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అల్వీన్ కాలనీకి వెళ్లే రహదారి కూడలి 65వ నెంబర్ జాతీయ రహదారి వద్దకు వాళ్లు చేరుకోగానే ఊహించని ఘోరం జరిగిపోయింది. అతి వేగంగా వచ్చిన ఓ టిప్పర్ వీళ్లు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో శ్రీధర్ అక్కడికక్కడే మరణించాడు. దీపికను పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపట్లోనే ఆమె కూడా మరణించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో ఆ మూడేళ్ల బాబు అనాథలా మిగిలిపోయాడు. అమ్మానాన్నా.. అంటూ అతడు ఏడుస్తోంటే ఏం చెప్పాలో తెలియక బంధువులు కన్నీటిపర్యంత మయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.