విశాఖకు కూతవేటు దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి భార్యభర్తలు మృతిచెందిన విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన రైలులో విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన వెంకటరమణారావు, మణి అనే దంపతులు కూడా రైలు ఎక్కారు. ఆదివారం తెల్లవారుజామున రైలు దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. దువ్వాడలో మణి తల్లిదండ్రులు ఉండటంతో, వారిని చూసి, ఆపై స్వగ్రామానికి వెళ్లాలనుకున్నారు. దీంతో ఇద్దరూ రైలు దిగేందుకు సిద్ధమయ్యారు.
రైలు నాలుగో నంబర్ ప్లాట్ ఫామ్ చేరుకొంది.అయితే దువ్వాడకు రైలు చేరుకున్న విషయం ఆలస్యంగా గుర్తించారు. దీంతో రైలు దిగే తొందరలో ప్రమాదవశాత్తు పట్టాలపై పడి ప్రాణాలను కోల్పోయారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, రెండు మృతదేహాలనూ అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.