Visakhapatnam: ఆడుకోమ్మా.. అంటూ నాలుగేళ్ల కూతురిని బయటకు పంపి.. ఆ భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకెళ్లి గడియపెట్టుకుని మరీ..

దేవేంద్ర, మోహని (ఫైల్ ఫొటో)

ఇంట్లో ఉన్న పాపను ఆడుకోమని ఆ భార్యాభర్తలిద్దరూ బయటకు పంపించారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. చాలా సేపటి నుంచి పాప ఒక్కతే ఇంటి సమీపంలో ఉండటంతో పక్కిళ్ల వాళ్లకు అనుమానం వచ్చింది. వెళ్లి చూస్తే..

 • Share this:
  నాలుగేళ్ల కూతురిని ఆడుకోమ్మా అంటూ బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. తలుపులకు గడియ పెట్టుకున్నారు. ఆ పాప ఒక్కతే పిల్లలతో కలిసి బయట ఆడుకుంటోంది. ఇంట్లోంచి ఎంతకూ తల్లిదండ్రులు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతుండటంతో జరగకూడనిది జరిగి ఉంటుందని డౌట్ వచ్చింది. అంతే తలుపులు తట్టి చూశారు. లోపలి నుంచి సమాధానం వినిపించలేదు. తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలకు వెళ్లారు. లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారి కూతురిని ఒంటరిని చేసి ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయారు. విశాఖపట్టణం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  విశాఖపట్టణం జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ బొండల మామిడికి చెందిన 25 ఏళ్ల మజ్జి దేవేంద్రకు, అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల మోహినితో పెళ్లయింది. ఐదేళ్ల క్రితమే వారికి వివాహం అయింది. ప్రస్తుతం వారికి నాలుగేళ్ల కూతురు హయతీ ఉంది. తన తల్లిదండ్రులు, భార్య, కూతురితో కలిసి దేవేంద్ర ఒకే ఇంట్లో ఉంటున్నారు. నాలుగేళ్లుగా వారి కాపురం సజావుగానే సాగింది. ఏడాది క్రితం నుంచే వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. నువ్వు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ దేవేంద్రను మోహిని దుర్భాషలాడేది. నువ్వే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ మోహినిని దేవేంద్ర సూటిపోటి మాటలు అనేవాడు. వివాహేతర సంబంధాల గురించి ఇద్దరూ పరస్పరం నిందించుకునేవాళ్లు. ఈ క్రమంలోనే వారం రోజులుగా వారిద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇతరులతో కూడా మాట్లాడటం మానేశారు.
  ఇది కూడా చదవండి: కెనడాలో 27 ఏళ్ల తెలుగు కుర్రాడి ఆత్మహత్య వెనుక అసలు కారణమిదా..? ఇంటికి వచ్చేందుకు విమాన టికెట్లను బుక్ చేసి మరీ..

  గురువారం ఉదయం దేవేంద్ర తల్లిదండ్రులు గుత్తులపుట్టు వారపు సంతకు వెళ్లారు. ఇంట్లో ఉన్న పాపను ఆడుకోమని ఆ భార్యాభర్తలిద్దరూ బయటకు పంపించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. చాలా సేపటి నుంచి పాప ఒక్కతే ఇంటి సమీపంలోని పిల్లలతో ఆటలాడుతూ ఉండటంతో పక్కిళ్ల వాళ్లకు అనుమానం వచ్చింది. మీ అమ్మానాన్న ఏరని అడిగితే ఇంట్లో ఉన్నారని చెప్పింది. కొద్ది రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో వాళ్లకు అనుమానం వచ్చింది. తలుపులు వేసి ఉండటం, ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో వారిలో అనుమానం బలపడింది. తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు.
  ఇది కూడా చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఓ వివాహితతో ఉన్న కుర్రాడికి షాకింగ్ అనుభవం.. పోలీసు శాఖలోనూ కలకలం.. అసలేం జరిగిందంటే..!

  ఇంటి దూలానికి ఇద్దరూ ఉరి వేసుకుని చనిపోయారు. వాళ్లను కిందకు దించి చూడగా అప్పటికే మరణించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, దేవేంద్ర తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చారు. ఇలాంటి ఘోరం జరుగుతుందని అనుమానం వస్తే అసలు బయటకే వెళ్లేవాళ్లం కాదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
  Published by:Hasaan Kandula
  First published: