news18-telugu
Updated: December 1, 2020, 1:15 PM IST
Extra Marital Affair: పోలీసులు కూడా మొదట ఇది ప్రమాదమేనని అనుకున్నారు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు చూసిన తర్వాత ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిర్థారణకు వచ్చారు.
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. మానవ సంబంధాలను మంటగలుపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భర్త.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి అతడిని చంపేందుకు కుట్ర పన్నింది. ప్రియుడితో కలిసి ఆ కుట్రను అమలు చేసింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన అంబటి అసరి సోలికి ఏడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. దంపతులిద్దరు శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అసరిసోలి భార్యకి అంపోలుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు షణ్ముఖరావుతో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా కాల క్రమంలో వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. ఈ విషయం అసరి సోలికి తెలిసింది. ఈ విషయంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవులు కూడా జరుగాయి. షణ్మఖరావుకు దూరంగా ఉండాలని పలుమార్లు భర్త హెచ్చరించినా భార్య పట్టించుకోలేదు. తమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని కోపం పెంచుకున్న అసరిసోలి భార్య.. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని షణ్ముఖరావుకు చెప్పింది. ఇద్దరూ కలిసి అసరిపోలిని ఎలాగైనా అంతమొందించాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూశారు.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జీటీ రోడ్డులోని ఓ నగల దుకాణం వద్ద భవననిర్మాణ పనికి అసరిసోలి, షణ్ముఖరావు వెళ్లారు. పని చేసే క్రమంలో రెండో ఆంతస్తులోని రాళ్లను కిందకి తీసుకురావాలని అసరిసోలిని షణ్ముఖరావు పురామాయించాడు. తీసుకొస్తున్న క్రమంలో ఎవరూ లేని సమయంలో రెండోఆంతస్తుకు వెళ్లిన షణ్ముఖరావు... అసరిసోలిని ఇటుక రాయితో బాలంగా కొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. పెనుగులాటలోనే అసరిపోలిని రెండో అంతస్తునుంచి కిందకి తోసేశాడు. షణ్ముఖరావు. లిఫ్ట్ గుంతలో పడిన అసరిపోలి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కాలి జారి పడ్డాడని తోటి కార్మికులను నమ్మించాడు. ఇదే విషయాన్ని అసరిపోలి భార్యకు ఫోన్ చేసి చెప్పాడు షణ్ముఖరావు. భార్య కూడా ఏమి తెలియనట్టు తన భర్త కాలిజారి పడి చనిపోయాడని పోలీసులకు తెలిపింది.
పోలీసులు కూడా మొదట ఇది ప్రమాదమేనని అనుకున్నారు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు చూసిన తర్వాత ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిర్థారణకు వచ్చారు. షణ్ముఖరావు, అసరిపోలి భార్యను అదుపులోకి తీసుకుని విడివిడిగా ప్రశ్నించారు. ఇద్దరి కాల్ డేటాని విశ్లేషించారు. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని నిర్థారణకు వచ్చారు. ఆ కోణంలో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. అసరిపోలిని అంతమొందిస్తే తమకు అడ్డు చెప్పేవారే ఉండరని అలా చేసినట్టు ఇద్దరు పోలీసుల ముందు అంగీకరించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
December 1, 2020, 1:15 PM IST