ఉద్యోగం కోసం తండ్రి హత్య.. ఫ్యామిలీ అంతా కలిసి.. తెలంగాణలోనే..

ప్రతీకాత్మక చిత్రం

బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకర్ 55 సంవత్సరాల సింగరేణి కార్మికుడు ఈ నెల 5 తేదీన అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు.

 • Share this:
  Telangana Crime News: ఉద్యోగం కోసం కుటంబ పెద్దను హత్య చేసేందుకు పథకం రచించింది ఓ కుటుంబం. అనుకున్నట్టుగానే దాన్ని అమలు చేసింది. హత్య చేసిన దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే నిజం ఎక్కువ రోజులు దాగలేదు. తెలంగాణలోని బెల్లంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకర్ 55 సంవత్సరాల సింగరేణి కార్మికుడు ఈ నెల 5 తేదీన అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు హత్య మిస్టరీ ఛేదించారు.

  సింగరేణి కార్మికుడైన ముత్తె శంకర్‌కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు శ్రావణ్ ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతోఅనేక సార్లు పంచాయితీ పెట్టగా వీరికి దూరంగా రెండేళ్లుగా మంచిర్యాలలొనే నివాసముంటున్నాడు. అయితే తన కూతురు స్వాతికి కరోనా వచ్చిందని ఆరోగ్యం బాగా లేదని కబురు రావడంతో చూసేందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పథకం ప్రకారం నిద్రిస్తున్న శంకర్‌ను గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

  బెల్ట్‌తో మెడకు ఉరివేసి చీర గొంతుకు బిగిసేలా చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చీర ఉరివేసుకున్నట్లు చేశారని దర్యాప్తులో తేలిందని బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ తెలిపారు. హత్యకు మరొక వ్యక్తి సహకరించారని ప్రస్తుతం పరారీలో ఉన్నడని త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. హత్యకు ఉపయోగించిన బెల్ట్,మరియు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: