Home /News /crime /

WIFE ALONG WITH HIS LOVER KILLED HUSBAND IN WANAPARTY DISTRICT OF TELANGANA AK

ExtraMarital Affair: గుడి దగ్గరకి వెళ్లి కోడిని కోసుకుని రమ్మన్న భార్య.. ఆ తరువాత.. వనపర్తి జిల్లాలో దారుణం

బాలస్వామి, లావణ్య (ఫైల్ ఫోటో)

బాలస్వామి, లావణ్య (ఫైల్ ఫోటో)

Wife Kills Husband: బాలస్వామి కిడ్నాప్ అయిన రోజు నుంచి లావణ్య కూడా కనబడకుండా పోయింది. దీనిపై ఆ మరుసటి రోజే బాలస్వామి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వివాహేతర సంబంధాలు పచ్చిన సంసారాలను సర్వనాశనం చేస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలోని ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చంది. ది. వనపర్తికి చెందిన చెందిన 39 ఏళ్ల బాలస్వామికి పదేళ్ల క్రితం లావణ్య అనే మహిళతో పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బాలస్వామి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో మదనాపురం మండలంలోని దంతనూర్‌కు చెందిన నవీన్‌ అనే యువకుడితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి బాలస్వామి, లావణ్య మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. అయితే కొంతకాలం క్రితం బాలస్వామి తనకున్న పోలాన్ని అమ్మేశాడు. దీంతో అతడికి రూ. 20 లక్షలు వచ్చాయి.

    ఈ డబ్బు రావడంతోనే లావణ్య బుద్ధి పక్కదారి పట్టింది. డబ్బుతో పాటు ప్రియుడిని పొందాలని ఆమె భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త బాలస్వామిని చంపేందుకు పథకం రచించింది. భర్తకు ఏ మాత్రం అనుమానం కలగకుండా ఉండేందుకు పూజల పేరుతో అతడిని ఒప్పించింది. తమకు మంచి జరగాలంటే మైసమ్మ గుడి దగ్గర కోడిని కోసుకుని రావాలని జనవరి 20న భర్తను కోరింది లావణ్య. భార్య మాటలను నమ్మిన బాలస్వామి..గుడికి వెళ్లాడు. అయితే అప్పటికే అతడి కోసం కాచుకుని కూర్చున్న నవీన్ అతడి స్నేహితులు.. బాలస్వామిని కిడ్నాప్ చేశారు. అతడిని కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లారు.

    ఈ క్రమంలోనే అతడిని కారులో గొంతునులిమి హత్య చేశారు. మృతుడి సెల్‌ఫోన్‌ను కొత్తకోట శివారులోని బ్రిడ్జి దగ్గర పడేశారు. ఆ తరువాత బాలస్వామిని చంపినందుకు రూ. 60 వేలు నవీన్‌కు ఇచ్చింది లావణ్య. బాలస్వామి కిడ్నాప్ అయిన రోజు నుంచి లావణ్య కూడా కనబడకుండా పోయింది. దీనిపై ఆ మరుసటి రోజే బాలస్వామి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Mahabubabad: టీఆర్ఎస్‌ కౌన్సిలర్ మర్డర్..సినీ ఫక్కీలో గొడ్డలితో నరికి చంపిన ప్రత్యర్ధులు

    Gold smuggling: అబుదాబి నుంచి గోల్డ్‌ని సీక్రెట్‌గా అక్కడ పెట్టుకొని తెచ్చాడు..చివరకు

    అప్పటి నుంచి పోలీసులు బాలస్వామి, అతడి భార్య లావణ్య, ఆమె ప్రియుడు నవీన్ కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల లావణ్య వనపర్తికి రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ప్రియుడు నవీన్‌తో పాటు బాలస్వామి హత్యలో భాగం పంచుకున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో వీరి ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు