ప్రేమించడమే పాపమా? పరువు హత్యలకు ముగింపు లేదా?

మన దేశంలో రోజు రోజుకూ కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగిన ఈ హత్యలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలేవి?

Krishna Kumar N | news18-telugu
Updated: December 23, 2018, 4:25 PM IST
ప్రేమించడమే పాపమా? పరువు హత్యలకు ముగింపు లేదా?
ప్రణయ్, అమృత... విషాదం మిగిల్చిన ప్రేమ వివాహం
  • Share this:
అనాదిగా అదే రక్త చరిత్ర. అబ్బాయీ, అమ్మాయీ ప్రేమించుకోవడం, అటువైపో, ఇటువైపే ఎవరో ఒకరి కుటుంబానికి నచ్చకపోవడం, ఆపై అయినవాళ్లనే చంపేయడం... ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు. పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకొని... అయినవాళ్లు సాధించేదేంటి? 'కని పెంచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిన మమ్మల్నే తిరస్కరిస్తారా' అనే తట్టుకోలేని భావనతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. కానీ వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆలోచించట్లేదు. మామాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి... పంతాలకు దారితీసి, ప్రాణాలను హరిస్తోంది. తమకు ఇష్టం లేని వివాహాలు చేసుకున్నారని నవ దంపతుల్ని హత్యలు చేయడానికి తల్లిదండ్రులు వెనుకాడకపోవడం అత్యంత దారుణ విషయం.

honor killing, honour killing, killing, honor, honor killings, what is an honor killing, honour killings, honour killing in india, honour killing, honour, honour killing case, honor killing victims, honor killing germany, islamic honor killing, honour killing india, delhi honour killing, honor killing pakistan, killing, honor killing (crime type), honor killing in america, honor killing love story, honour killing germany, daughter, daughter killed, killed, mother killed, shot and killed, mom killed, bride shot and killed, pregnant woman killed, mother, minneapolis cop killed bride, woman killed while holding dau, minnesota woman killed by fian, daytime, drunk driving, news, long island, latest news, పరువు హత్య, పరువు హత్యలు, పరువు హత్య కుల హత్య, హత్య, ఒరిజినల్, వైరల్, డైలీన్యూస్, కసాయి తండ్రి, వీడియో, కేసులో, కొత్త కోణం, మిర్యాలగూడ, పరువు హత్య, కూతుర్ని చంపిన కుటుంబం,
అనురాధ ప్రేమ వివాహం


మంచిర్యాల జిల్లా... జన్నారం మండలంలోని కలమడుగుకు చెందిన అనురాధ... స్థానిక ఓ కుర్రాణ్ని ప్రేమించింది. ఇద్దరూ కలిసి ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చని ఆమె కుటుంబ సభ్యులు... అనురాధను సొంతూరికి తీసుకొచ్చి చితకబాదారు. నొప్పులు తాళలేక కన్నవాళ్ల చెంతనే ఆమె ప్రాణాలు విడిచింది. ఏమాత్రం జాలి, దయ, కరుణ లేని ఆ కుటుంబం... రాత్రికి రాత్రే కూతురిని పొలంలో దహనం చేసి... ఆనవాళ్లు లేకుండా మాయం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు... వాళ్లను అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

honor killing, honour killing, killing, honor, honor killings, what is an honor killing, honour killings, honour killing in india, honour killing, honour, honour killing case, honor killing victims, honor killing germany, islamic honor killing, honour killing india, delhi honour killing, honor killing pakistan, killing, honor killing (crime type), honor killing in america, honor killing love story, honour killing germany, daughter, daughter killed, killed, mother killed, shot and killed, mom killed, bride shot and killed, pregnant woman killed, mother, minneapolis cop killed bride, woman killed while holding dau, minnesota woman killed by fian, daytime, drunk driving, news, long island, latest news, పరువు హత్య, పరువు హత్యలు, పరువు హత్య కుల హత్య, హత్య, ఒరిజినల్, వైరల్, డైలీన్యూస్, కసాయి తండ్రి, వీడియో, కేసులో, కొత్త కోణం, మిర్యాలగూడ, పరువు హత్య, కూతుర్ని చంపిన కుటుంబం,
ప్రణయ్, అమృత (ఫైల్ ఫొటో)


ఇంతకు ముందు నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన ప్రణయ్-అమృత వర్షిణి చిన్నతనంలోనే ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లిచేసుకున్నారు. ప్రణయ్ ది సాధారణ కుటుంబం. అమృత తండ్రి మారుతిరావు పెద్ద రియల్టర్, కోట్ల ఆస్తిపాస్తులు, సమాజంలో పలుకుబడి ఉన్నాయి. కూతురు.. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడటం తట్టుకోలేకపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి... నడిరోడ్డుపైనే ప్రణయ్‌ని అతి దారుణంగా హత్య చేయించాడు. కళ్లముందే తన భర్తను నరికేస్తే ప్రాణం పోయినంతగా విలవిల్లాడింది అమృత. తనను ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ ఇకలేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. చిన్నవయసులోనే ప్రేమను గెలిపించుకున్నా... జీవితంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.

పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. పేగుతెంచుకుపుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. నల్గొండ జిల్లాలోనే స్వాతి-నరేష్ కథ ఇప్పటికీ, ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని విషాదం. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి, నరేష్ ఎక్కడో దూరంగా వెళ్లి గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. తను మారిపోయానని, మీ పెళ్లిని అంగీకరిస్తానని పిలిపించి మరీ నరేష్‌ను స్వాతి తండ్రి చంపిన తీరు ఉలిక్కిపడేలా చేసింది. నరేష్ దారుణహత్యకు గురైతే... స్వాతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. వాళ్లదీ కులాంతర వివాహమే. పెద్దల కులపిచ్చికి ఆ జంట చివరికలా బలైపోయింది.


ప్రకాశం జిల్లా కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లిలో జరిగింది మరో దారుణం. గిరెడ్డి పల్లికి చెందిన ఆవులయ్య కూతురు ఇంద్రజ, అదే ఊరికి చెందిన చైతన్య ప్రేమలో పడ్డారు. అతను దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. ‘మీ అమ్మాయి వైపు నేను చూడను. నా వైపు మీ అమ్మాయి చూడకూడదు’ అని పోలీస్ స్టేషన్‌లో ఒప్పందం చేయించుకున్నారు. ఈ విషయం తెలిసి ఇంద్రజ అన్నం తినడం మానేసింది. తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఆమె అన్నం తినకుండా అలాగే ఉండడంతో మళ్లీ సొంతూరికి తీసుకొచ్చారు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఉరేసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి తగులబెట్టారు. తెల్లవారుజామున మంటలు వస్తుండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.పరువు హత్యల్ని నిరోధించే చట్టాలేవి?
ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నైతే ప్రపంచానికి తెలియట్లేదు కూడా. పరువు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టాలు అంటూ లేవు. ఇదొక సామాజిక జాఢ్యం. దీనికి సంబంధించి పబ్లిక్‌గా మాట్లాడేందుకు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, ప్రజా హక్కుల సంఘాల నేతలు ఇష్టపడరు. వీటితో ఓటు బ్యాంకు రాజకీయాలు ముడిపడి ఉంటాయి. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే బాలికలు కచ్చితంగా ఫలానా డ్రస్సు వేసుకోవాలని, మొబైల్ ఫోన్లను వినియోగించరాదనే ఆంక్షలను కొన్ని చోట్ల సంబంధిత కుల, మత సంఘాల పెద్దలు విధిస్తుండడాన్ని చూస్తున్నాం. 2006లో ఒక పరువు హత్య కేసు ఘటనలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ- ‘ఈ తరహా హత్యల నిరోధానికి కఠిన చట్టాలు అవసరం ’ అని పార్లమెంటుకు గుర్తు చేసింది. అయినా అలాంటి చట్టాలు రావట్లేదు. అయినవాళ్లను చంపుకొని... ఈ కుటుంబాలు సాధించేదేమిటి? కులం, మతం, పరువు, ప్రతిష్టలు ఎవర్ని ఉద్ధరించడానికి? జైలుకెళ్లిన వాళ్ల పరువు నిలబడుతుందా? చక్కటి జంటలను విడగొట్టి, విషాదాలకు కారణమవుతున్న వాళ్లలో మార్పు వచ్చేదెప్పుడు?
Published by: Krishna Kumar N
First published: December 23, 2018, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading