Home /News /crime /

WHY ARE YOUTH PROTESTING AGAINST CENTRES AGNIPATH SCHEME NEWS18 EXPLAINS FEARS WHAT GOVT SAYS GH PAH

Explainers: అగ్నిపథ్ స్కీమ్‌పై ఎందుకంత వ్యతిరేకత..? భయాలు, అపోహలు, కేంద్రం వైఖరిపై న్యూస్‌18 వివరణ..

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

భారత యువతకు సాయుధ బలగాల్లో అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు.

భారత యువతకు సాయుధ బలగాల్లో అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో ఉద్యోగ భద్రత లేదని ఆరోపిస్తూ బీహార్, రాజస్థాన్. ఇతర రాష్ట్రాల్లో భారీ నిరసనలు చెలరేగాయి. ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణపై న్యూస్‌18 ప్రత్యేక కథనం..

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ భద్రతపై కేబినెట్ కమిటీ మంగళవారం స్పష్టత ఇచ్చింది. ఈ పథకం కింద, 17 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల 46,000 మంది యువకులను నాలుగు సంవత్సరాలపాటు ఒప్పందంతో మూడు సర్వీసుల్లోకి చేర్చుకుంటారు. అయితే నిరసనల తర్వాత, కేంద్రం గురువారం కొత్త అగ్నిపథ్ సైనిక పథకం కింద రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట ప్రవేశ వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచింది.డిఫెన్స్ సర్వీస్ ఔత్సాహికులు బీహార్‌లోని అనేక ప్రాంతాలలో రైలు, రోడ్డులపై నిరసనలు చేపట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. తాత్కాలిక ఉద్యోగం, గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేవని రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు టైర్లు, బస్సులను ధ్వంసం చేశారు. రైళ్లకు నిప్పంటించడంతో రాష్ట్రంలోని ముంగేర్, జెహనాబాద్‌లలో ఆందోళన హింసాత్మకంగా మారింది.

* నిరుద్యోగ భావన
జెహనాబాద్ ఎమ్మెల్యే కుమార్ కృష్ణమోహన్ అకా సుదయ్ యాదవ్ మాట్లాడుతూ..‘రక్షణ సేవల్లో చేరడానికి సిద్ధమవుతున్న విద్యార్థుల కోసమని చెబుతూ తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ఆత్మహత్య చర్య లాంటిది. ప్రభుత్వం నిబంధనలను మార్చడం ద్వారా విద్యార్థులను మోసం చేసింది. బీహార్ యువకుల రాష్ట్రం, ఈ నిర్ణయం తర్వాత అందరూ నిరుద్యోగ భావాన్ని ఎదుర్కొంటున్నారు. బీహార్ ఎల్లప్పుడూ అనేక ఉద్యమాల ద్వారా దేశానికి మార్గాన్ని చూపుతుంది. ఈ నిరసన కూడా ముందుకు మార్గాన్ని చూపుతుంది. ఆందోళనల్లో ఏ రూపంలోనైనా పాక్షిక నష్టం జరుగుతుంది.’ అని అన్నారు.

బీహార్‌లో మొదలైన నిరసనలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు వ్యాపించాయి. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో ప్రవేశపెట్టిన మార్పులపై తాము అసంతృప్తిగా ఉన్నామని అభ్యర్థులు తెలిపారు. అనేక ఇతర డిమాండ్‌లతో పాటు, విద్యార్థులు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. ఓ వార్తా సంస్థతో ఆందోళనలో పాల్గొన్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. పరీక్ష ఇంతకు ముందు జరిగినట్లుగానే నిర్వహించాలని, కేవలం నాలుగేళ్ల పాటు మాత్రమే ఎవరూ సాయుధ దళాలలో చేరడానికి ఇష్టపడరని చెప్పాడు. ఆర్మీలో చేరడానికి ఏళ్ల తరబడి సాధన చేస్తున్నామని, నాలుగేళ్లపాటు మాత్రమే కాంట్రాక్టు టర్మ్‌లో ఉంటుందని ఇప్పుడు మాకు తెలిసిందని, ఇది మాలాంటి విద్యార్థులకు సరికాదని మరో విద్యార్థి వివరించాడు.

* ప్రభుత్వం ఏం చెప్పింది
అగ్నివీర్‌లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని, నాలుగేళ్ల తర్వాత వారు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొంది. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని, చదువు కొనసాగించాలనుకుంటే 12వ తరగతికి సమానమైన ధ్రువీకరణ పత్రం ఇస్తామని చెప్పింది. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. సైన్యంలో నియామకాలు తగ్గుతాయని వస్తున్న ఆరోపణలు సరికాదని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో సాయుధ బలగాల్లో అగ్నివీర్‌ల సంఖ్య మూడింతలు అవుతుందని చెప్పింది.

రెజిమెంట్‌ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగవని, ఈ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, మునుపటి కంటే యూనిట్‌లలో సామర్థ్యం పెరుగుతుందని వివరించింది. స్వల్పకాలిక భర్తీ ప్రక్రియ విధానం ఉత్తమ మైందని ఇప్పటికే చాలా దేశాల్లో రుజువైందని, మొత్తం సాయుధ బలగాల సంఖ్యతో పోలిస్తే ఎంపికయ్యే అగ్నివీర్‌ల సంఖ్య మూడు శాతమేనని పేర్కొంది. అగ్నివీర్‌లు నాలుగేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి పరీక్షించి ఉత్తమమైన వారినే ఎంపిక చేస్తామని, కాబట్టి మరింత బలంగా సైన్యం తయారవుతుందని తెలిపింది.

* కొనసాగుతున్న వ్యతిరేకత
ప్రభుత్వం వివరణ అనంతరం కూడా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు పథకం రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ర్యాంక్ లేదు, పెన్షన్ లేదు, 2 సంవత్సరాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదు, నాలుగేళ్ల తర్వాత స్థిరమైన భవిష్యత్తు లేదు, సైన్యంపై ప్రభుత్వానికి గౌరవం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Agnipath Protest, Agnipath Scheme, College student, Delhi

తదుపరి వార్తలు