కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....

Kurnool Murder : కాలం కరుగుతోంది... చరిత్ర మారుతోంది... ఫ్యాక్షన్ హత్యలకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నాం. పాత కక్షలు పెంచుకొని... ప్రాణాలు తీసేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 12:25 PM IST
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌... కర్నూలు జిల్లాలో జరిగిందీ ఘోరం. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డిని దుండగులు దారుణంగా చంపేశారు. డోన్ మండలం, తాపల కొత్తూరులో శేఖర్ రెడ్డి టీవీఎస్‌పై వెళ్తున్నారు. అప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిలీజవ్వడం, వాటిలో చాలా వరకూ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో... అధికారంలోకి వచ్చేది వైసీపీయా, టీడీపీయా అని ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు. అర్జెంటుగా వెళ్లి చెయ్యాల్సిన పనులేవీ లేకపోవడంతో... మరీ వేగంగా కాకుండా... నార్మల్ స్పీడులో వెళ్తున్నాడు. మే 23న ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, హంగ్ వస్తే ఏంటి పరిస్థితి, వైసీపీ వస్తే ఏంటి పరిస్థితి... ఇలా రకరకాలుగా అతని ఆలోచనల ప్రవాహం సాగుతోంది. ఇంతలో... కాస్త దూరంలో ఎదురుగా కొందరు కనిపించారు. కొంచెం ముందుకి వెళ్లేసరికి వాళ్ల చేతుల్లో రాడ్లూ, కర్రలూ కనిపించాయి. ఎక్కడో అనుమానం మొదలైంది. బండి కాస్త స్లో చేశాడు. వాళ్లవైపే తీక్షణంగా చూస్తుంటే... ఆ శత్రువుల పరిగెడుతూ శేఖర్ రెడ్డివైపు వస్తున్నారు. శేఖర్ రెడ్డికి అంతమందినీ, వాళ్లలో ఆవేశాన్నీ చూశాక... ఏదో భయం మొదలై... ముఖమంతా ముచ్చెమటలు పట్టాయి. ఏమాత్రం గ్యాప్ ఇవ్వని ప్రత్యర్థులు... శేఖర్ రెడ్డిపై దాడి చేశారు. కర్రలున్నవాళ్లు... కర్రలతో శరీర అవయవాలపై దాడి చేశారు. రాడ్లు ఉన్నవాళ్లు... ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని చూడకుండా... చితకొట్టేశారు. ఇక బండరాళ్లు ఉన్నవాళ్లు తలనే టార్గెట్ చేశారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు తల పచ్చడై, మెదడు బయటికొచ్చేసింది. ఇలా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుండానే... శత్రువుల చేతిలో... అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు శేఖర్ రెడ్డి.

sekhar reddy, kurnool, lagadapati rajagopal survey, lagadapati survey, exit polls,exit polls 2019,exit polls 2019 lok sabha,ap exit polls,exit polls india,ap exit polls 2019,exit polls india 2019,ap elections exit polls,lok sabha elections exit polls,exit poll,india exit polls,ap 2019 exit polls,exit,exit polls in twitter,2019 exit polls results,exit polls elections 2019,ap 2019 exit polls results,exit polls 2019 latest news,exit poll results, counting day, votes counting, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019, lok sabha election, lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawankalyan, janasena, poll results, survey, లగడపాటి రాజగోపాల్, లగడపాటి సర్వే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్, ఓట్ల లెక్కింపు, ఎగ్జిట్ పోల్స్ చరిత్ర, ఏపీలో టీడీపీ, శేఖర్ రెడ్డి, కర్నూలు, హత్య,
శేఖర్ రెడ్డి మృతదేహం


అతన్ని చంపేసిన దుండగులు... ఎటు నుంచీ వచ్చారో అటే వెళ్లినట్లు తెలిసింది. గంటలోనే విషయం స్థానికులందరికీ తెలిసింది. వాళ్ల ద్వారా సమాచారం పోలీసులకు వెళ్లింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపిన పోలీసులు... ఇది ఫ్యాక్షన్ మర్డరా? రాజకీయ హత్యా? ఇంకేదైనా కోణం ఉందా? సరిగ్గా ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న సమయంలో చంపిందెవరు? ప్రాణాలు తీసేసేంత శత్రుత్వం శేఖర్ రెడ్డికి ఏముంది... ఇలా రకరకాలుగా ఎంక్వైరీ మొదలుపెట్టారు.

లోక్ సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఒక రోజు ముందు ఈ హత్య జరగడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి ఉంది. హంతకుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను దింపారు. ఎవరూ ఎలాంటి హింసకూ పాల్పడకుండా ఉండాలని ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించాలని అధికారులు భావిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...

వైసీపీ విజయం... టీడీపీ ఓటమి... ఆ సర్వే ప్రకారం ఈ ఫలితం

నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...
First published: May 22, 2019, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading