ఆ ముగ్గురూ ఎవరు? నెల్లూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు...

ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తనతో మాట్లాడాలని ఆ కుర్రాళ్లను ఎందుకు బతిమలాడింది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ కేసులో ఉన్నాయి.

news18-telugu
Updated: July 13, 2020, 12:40 PM IST
ఆ ముగ్గురూ ఎవరు? నెల్లూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు...
ఆ ముగ్గురూ ఎవరు? నెల్లూరు విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు...
  • Share this:
నెల్లూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎన్నో రకాల చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. రమ్య తన ఇంట్లోనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమెను ముగ్గురు యువకులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంది అని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రాసి... ఎంక్వైరీ మొదలుపెట్టారు. ముందుగా ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా కొత్త విషయాలు తెలిశాయి. రమ్య ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందువరకు శివ అనే యువకుడితో వాట్సాప్ చాటింగ్ చేసింది. తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు బతిమలాడినా అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్సూ రాలేదు. "నాతో మాట్లాకపోతే ఉరేసుకుంటా" అని బెదిరించినా ఆ కుర్రాడు స్పందిచలేదు. చివరికి కెమెరా వీడియో ఆన్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.

భార్గవ్ అనే యువకుడికి కూడా రమ్య మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు... మరో వ్యక్తి పాత్ర కూడా ఈ కేసులో ఉండి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ముగ్గురు ఆమెకు క్లాస్‌మేట్స్ గానీ, ఫ్రెండ్స్‌ గానీ కాదని రమ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరైతే... రమ్య వాళ్లతో ఎందుకు చాట్ చేస్తోంది? ఎందుకు మాట్లాడమని బతిమలాడుతోంది? అసలు ఏం మాట్లాడాలి? వాళ్లు మాట్లాడకపోతే... ప్రాణాలు తీసుకోవాల్సినంత పరిస్థితి ఏముంది? ఇప్పటివరకూ ఆ ముగ్గురి గురించీ తల్లిదండ్రులకు తెలియలేదంటే... ఆమె వాళ్లతో అంత సీక్రెసీ ఎందుకు మెయింటేన్ చేస్తోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

రమ్య మొబైల్‌లో వాట్సాప్ చాటింగ్


తమ కూతురు గదిలో నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని వివరించారు. ఇప్పుడు ఈ కేసు మిస్టరీ వీడాలంటే... ఆ యువకుల్లో ఒక్కడు దొరికినా చాలు. అదేమీ కష్టం కాదు. రమ్య మొబైల్‌లో ఆ ముగ్గురి మొబైల్ నంబర్లూ ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా... వాళ్లెవరు, వాళ్ల అడ్రెస్ ఎక్కడ? ఆధార్ నంబర్లేంటి? ఇలా అన్ని వివరాల్నీ పోలీసులు తెలుసుకోగలరు. కాకపోతే... ఇందుకు ఓ నాల్రోజులు టైమ్ పడుతుంది.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 12:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading