హోమ్ /వార్తలు /క్రైమ్ /

Susheel Kumar : రెజ్లర్ సుశీల్ కుమార్ ఎక్కడ? హరిద్వార్ ఆశ్రమంలో దాక్కున్నాడా? నాన్ బెయిలబుల్ వారెంట్!

Susheel Kumar : రెజ్లర్ సుశీల్ కుమార్ ఎక్కడ? హరిద్వార్ ఆశ్రమంలో దాక్కున్నాడా? నాన్ బెయిలబుల్ వారెంట్!

సుశీల్ కుమార్ కోసం కొనసాగుతున్న వేట

సుశీల్ కుమార్ కోసం కొనసాగుతున్న వేట

సుశీల్ కుమార్ ఎక్కడ దాక్కున్నాడో అని ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అవగా.. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు.

  ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియంలో మే 4 రాత్రి సాగర్దండక్ అనే 23 ఏళ్ల రెజ్లర్ ఘర్షణలో (Wrestlers Brawl) గాయపడి చనిపోయాడు. ఈ ఘర్షణకు మూల కారణం స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (Susheel Kumar) అనే విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు (Delhi Police) కూడా ప్రత్యక్ష సాక్షులు, గాయపడిని ఇతర రెజ్లర్లను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. సాగర్, అతడి స్నేహితులపై హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో సుశీల్ స్వయంగా దాడి చేసినట్లు ఒక వీడియోలో స్పష్టంగా ఆధారాలు దొరికాయి. దీంతో సుశీల్‌పై మర్డర్ కేసు నమోదయ్యింది. హత్య జరిగిన నాటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని వెళ్లాడు. అతడితో పాటు అతని స్నేహితులపై పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notice) జారీ చేశారు. అతడి కోసం 20 బృందాలుగా విడిపోయిన 50 మంది ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. కాగా సుశీల్ కుమార్‌తో పాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non Bailable Notice) జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఢిల్లీ కోరు శనివారం ఉత్తర్వులు అందించింది.

  అయితే గత 12 రోజులుగా కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ అసలు ఎక్కడ తలదాచుకున్నాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అతడికి బయటి నుంచి ఎవరైనా సహాయం చేస్తున్నారా? రాజకీయ నాయకుల అండ ఏమైనా ఉన్నదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా సుశీల్ కుమార్ ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్చాఫ్ వస్తున్నది. సుశీల్ కుమార్ ఇళ్లు, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అయినా ఎలాంటి ప్రయోజం లేకపోయింది. సుశీల్ కుమార్ హరిద్వార్ లోని ప్రముఖ యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో తలదాచుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ సోదాలు చేయడానికి పోలీసులకు ఎలాంటి అనుమతులు లేవు. దీంతో పోలీసులు సుశీల్ కుమార్‌కు నోటీసులు పంపారు. వెంటనే పోలీసులకు లొంగి పోకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు.

  ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 విమానాశ్రయాలు ఇవే.. ఇందులో ఇండియాకు చెందిన ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది..!

  మరోవైపు సుశీల్ కుమార్‌కు అనుచరుడిగా పేరున్న అజయ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను కూడా ఘటన జరిగిన నాటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో అజయ్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయితే అజయ్, సుశీల్ కలిసే ఉన్నారా? లేదా విడివిడిగా ఎక్కడైనా దాక్కున్నారా అనే విషయం తెలియడం లేదు. ఢిల్లీ-హర్యాణా సరిద్దుల్లో మొదట్లో గాలించిన పోలీసులు.. ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆశ్రమాలు, రిసార్టుల్లో గాలింపు చేపట్టారు. కరోనా కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తున్నది.

  Published by:John Kora
  First published:

  Tags: Delhi police, Murder, Susheel kumar, Wrestling

  ఉత్తమ కథలు