Cab Driver: క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళ.. కోపంతో ఆ డ్రైవర్ ఏ చేశాడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Cab Driver: క్యాబ్ బుక్ చేసుకున్న మహిళకు కారులో సౌకర్యాలు నచ్చగా రైడ్ క్యాన్సిల్ చేసింది. దీంతో సదరు డ్రైవర్ ఆ రోజు నుంచి ఆమె మొబైల్ కు, తన భర్త మొబైల్ కు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపడం మొదలు పెట్టాడు. చివకు ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. చివరకు ఏం జరిగిందంటే..

  • Share this:
    ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే సాధారణంగా సొంత వాహనాలు ఉంటే తీసుకెళ్తాం. ఒక వేళ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యాబ్(Cab) బుక్ చేసుకొని వెళ్తుంటారు చాలామంది. అయితే ఏవరైనా క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత అందులోనే ప్రయాణించి గమ్యస్తానికి చేరుతారు. ఇక్కడ ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ప్రయాణం చేయటానికి బుక్ చేసుకున్న కారులో సౌకర్యాలు లేని కారణంతో, రైడ్ క్యాన్సిల్(Ride Cancel) చేసుకుంది ఓ మహిళ. దీంతో ఆ మహిళకు ఆ క్యాబ్ డ్రైవర్ అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతూ వేధించసాగాడు. మహిళ ఫిర్యాదుతో క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ముంబైలోని బోరివ్లి లో ఓ మహిళతో పాటు తన మామ, భర్త నివసిస్తున్నారు.

    School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..


    ఓ రోజు వాళ్లు దక్షిణ ముంబై వెళ్లేందుకు ఓ యాప్ ద్వారా  క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇంటికి వచ్చిన ఆ క్యాబ్ డ్రైవర్ అధిక చార్జీ అవుతుందని డిమాండ్ చేశాడు. క్యాబ్ లో కనీస సౌకర్యాలు లేవు.. ఎలా అంత డబ్బులు ఇవ్వాలంటూ వారివురి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో క్యాబ్ బుక్ చేసుకున్న సదరు మహిళ అప్పటికప్పుడే రైడ్ క్యాన్సిల్ చేసుకుంది.

    ఇంత దూరం మీరు బుక్ చేయడం వల్లనే వచ్చాను.. తనకు పెట్రోల్ ఖర్చు అదనంగా అయింది.. మీ వల్ల నష్టపోయాను అంటూ వాగ్వాదం చేసుకున్నాడు. మాకు సంబంధం లేదు.. మీ క్యాబ్ లో కనీస సౌకర్యాలు లేకపోవడంతోనే రైడ్ క్యాన్సిల్ చేశామని ఆమె అన్నారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ ఆమె భర్తను అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

    Shocking: వామ్మో.. ఏందది.. వీడియో చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది.. అస్సలు మీరు మనుషులేనా..


    తర్వాత మహిళ, ఆమె భర్త ఫోన్లకు వివిధ నంబర్ల నుంచి బెదిరింపులు, అసభ్య వీడియోలు , అసభ్య పదజాలంతో మెసేజ్ లు రావటం మొదలయ్యింది. ఎక్కడ నుంచి ఆ వీడియోలు వస్తున్నాయో అర్థం గాక సదరు మహిళ స్థానికంగా ఉండే ఎల్టీ మార్గ్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు, వీడియోలు పోలీసులకు చూపించింది. ఫోన్ నెంబర్లు ఆధారంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు ఆ మెసేజ్ లు వీడియోలు క్యాబ్ డ్రైవర్ ఉత్సవ్ కుమార్ ఫోన్ నంబర్లు నుంచి వచ్చినట్లు గుర్తించారు.

    పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించగా.. ఆ క్యాబ్ డ్రైవర్ అప్పటికే బిహార్ పారిపోయినట్లు తెలిసింది. ఇక్కడ నుంచి ఓ పోలీసు బృందం బీహార్ వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ఆ మెసేజ్ లు, వీడియోలు పంపించడంలో తన పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. దీంతో అతడు మహిళను ఇబ్బంది పెట్టినందుకు నిందితుడిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడికి కఠిన శిక్ష విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: