WhatsApp Group Admin Assaulted : ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం, దారుణంగా వ్యవహరించడం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న విషయాలకే నేరాలు,ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురిచేస్తోంది. సాధారణంగా ఎవరైనా వాట్సాప్ గ్రూప్(WhatsApp Group) నుంచి తొలగిస్తే మళ్లీ చేర్చమని అడుగుతారు. కానీ ఏకంగా అడ్మిన్‌ను చితకబాది, నాలుక(Tongue Cut) కోసేశారు ఐదుగురు వ్యక్తులు. డిసెంబరు 28,2022న హారాష్ట్రలోని పుణే(Pune)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూణే లోని పుర్సుంగిలోని ఓ హౌజింగ్ సొసైటీలో నివసించే బాధితుడైన గ్రూప్ అడ్మిన్..హౌసింగ్ సొసైటీ మాచారం కోసం "ఓం హైట్స్ ఆపరేషన్" పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. ఆ సొసైటీలోని సభ్యులందరూ ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. అయితే ఇటీవల ఏం జరిగిందో తెలియదు కానీ ఓ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించాడు అడ్మిన్. అయితే తనను ఎందుకు గ్రూప్ నుంచి తొలగించావంటూ ఆ సభ్యుడు కోపంతో అడ్మిన్‌కు మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ కి అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో డిసెంబర్ 28న అడ్మిన్‌కు ఫోన్ చేసి కలవాలని అనుకుంటున్నానని చెప్పాడు. తనతో పాటు మరో నలుగురిని తీసుకువెళ్లి.. అడ్మిన్‌తో వాగ్వాదానికి దిగాడు. తనను గ్రూప్ నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో అందరూ కలిసి అతడిపై దాడికి దిగి చిదకబాదారు. అనంతరం అడ్మిన్ నాలుక కోసి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి వెంటనే బాధితుడిని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. డాక్టర్లు నాలుకకు కుట్టు వేశారు. విషయం తెలియడంతో హౌజింగ్ సొసైటీలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై బాధిత అడ్మిన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
జిలేబీ తిని సీటుకు తుడుస్తారు..థియేటర్ లోకి బయటి ఫుడ్ అనుమతిపై సుప్రీం సంచలన తీర్పు
కాగా,అంతకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పూణెలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హ్యాపీ న్యూఇయర్ చెపపలేదంటూ ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కొందరు మద్యం మత్తులో యువకులు రోడ్డుపై వెళ్తున్న వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు హ్యాపీ న్యూయర్ చెప్పకపోవడంతో నలుగురు కలిసి ఆ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి చేయి విరగ్గొట్టారు. ఈ ఘటన స్థానింగా కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Pune news, Whatsapp