Hair Transplant Fail : ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ఒకే స్వభావం ఉండదు. కొందరు నిర్లక్ష్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడితే, కొందరు చిన్న విషయాలకు టెన్షన్ పడటం ప్రారంభిస్తారు. చిన్న విషయాలకే టెన్షన్ పడే వ్యక్తులు తరచుగా డిప్రెషన్(Depression)లో పడతారు, దీంతో వారి జీవితం కష్టంగా మారుతుంది. చిన్న విషయానికే ఆందోళన చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య(Sucide) చేసుకున్న ఘటన తాజాగా బ్రిటన్ లో వెలుగుచూసింది. అయితే అతని ఆత్మహత్యకు కారణం ఏంటన్నది తెలిస్తే ఎవరైనా సరే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడబ్బా అని మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ నివేదిక ప్రకారం... వేల్స్‌లోని ఆంగ్లేసీలోని లానెర్కిమెడ్ కి చెందిన 47 ఏళ్ల జాన్ గ్విండాఫ్ ఓవెన్ తన తల్లితో జీవిస్తున్నాడు. తలపై వెంట్రుకలు(Hair) లేకపోవడంతో జాన్...2004 సంవత్సరంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. అయితే అది విజయవంతం కాలేదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్(Hair Transplant Fail) ట్రీట్మెంట్ తర్వాత జాన్ తలపై గుర్తులు ఉండిపోయాయి. దీంతో తన తలపై ఉన్న మార్క్స్ ను చూసి ప్రజలు ఎగతాళి చేస్తారేమోనని జాన్ భయపడ్డాడు. దీంతో 2004 సంవత్సరంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు, కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆ తర్వాత జాన్ తాను నియంత్రించుకొని 27 సంవత్సరాలు కోళ్ల ఫారంలో తన జీవితాన్ని గడిపాడు. గతేడాది ఏమి జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి అతని స్వభావం మారడం ప్రారంభించింది. మళ్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి చింతించడం ప్రారంభించాడు. గతేడాది బ్రిడ్జిపై నుంచి దూకి గాయాలపాలై 16 రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా జనాలు తన తలపై ఉన్న గుర్తులను చూసి తనని ఆటపట్టించడం మొదలుపెడతారేమోనని మళ్లీ ఆందోళన చెందాడు. తాజాగా తన ఇంట్లోని షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
55 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల అమ్మాయి డేటింగ్..షుగర్ డాడీ అంటూ నెటిజన్లు సెటైర్లు
2004 తర్వాత నుంచి జాన్.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని డాక్టర్లు పరిశోధనలో కనుగొన్నారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. ఒక వ్యక్తి తన శరీరం, ముఖం లోపాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుండటం ఈ వ్యాధి లక్షణం. దీనితో పాటు, జాన్‌కు డిప్రెషన్ సమస్య కూడా ఉంది, దాని కారణంగా అతని పరిస్థితి మరింత దిగజారిందని డాక్టర్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.