హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇంట్లో రాఖీపూర్ణిమ వేడుకలు.. వాష్ రూమ్ లో నల్లా ఆఫ్ చేయలేదని కోడలు ఏంచేసిందో తెలుసా..?

ఇంట్లో రాఖీపూర్ణిమ వేడుకలు.. వాష్ రూమ్ లో నల్లా ఆఫ్ చేయలేదని కోడలు ఏంచేసిందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Bengal: అప్పటి వరకు కుటుంబసభ్యులంతా సంతోషంగా రాఖీపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే.. రాత్రి అయ్యేసరికి జరిగిన సంఘటనతో అప్పటి వరకు ఉన్న వినోదం కాస్తా.. కోలుకోలేని విషాదంగా మారిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

వెస్ట్ బెంగాల్ లో (West bengal) పండుగ రోజు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హౌరాలోని ఎంసీ లేన్ లో బుధవారం రాత్రి ఈ ఘటన సంభవించింది. ఉమ్మడి కుటుంబం పైన , కింద అంతస్థులలో ఉంటారు. వారంతా రాఖీ పౌర్ణమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే.. కింది పోర్షన్ లో ఉన్న అత్తగారు.. మరిది కుటుంబం వాష్ రూమ్ లోని ట్యాప్ ను ఆఫ్ చేయలేదు. దీంతో పలుమార్లు బోర్ వేయాల్సి వచ్చింది. దీంతో పైన పొర్షన్ లో ఉండే పల్లబిడే చిరాకు పడింది.

వెంటనే కోపంతో కిందకు వెళ్లింది. అసలే.. నీటి ఎద్దడి ఉందని ఎందుకు నీళ్లను వేస్ట్ చేస్తున్నారని వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగకుండా.. కంట్రోల్ తప్పి.. అక్కడ ఉన్న కత్తితీసుకుని అత్తను, పొడిచింది. ఆ తర్వాత.. అడ్డుకున్న మరిదిని, అతని భార్యను, పిల్లాడిని కూడా చంపింది. ఈ క్రమంలో అక్కడ అంతా రక్తసిక్తంగా మారిపోయింది. అరుపులు విన్న పక్కింటి వారు, భర్త కిందకు వచ్చి చూశారు. అక్కడ అందరు శవాలుగా పడి ఉండటాన్ని చూసి షాక్ కు గురయ్యారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పల్లబిడే భర్త అక్కడి నుంచి పారిపోయాడు. నిందితురాలు పల్లబిడేను అరెస్టు చేశారు. చనిపోయిన వారిలో.. తన అత్త మాధబి (58), బావమరిది దేబాషిస్ (36), అతని భార్య రేఖ (31), వారి 13 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన ఆరోపణలపై మహిళను అరెస్టు చేశారు. మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ముంబైలోని లోకల్ ట్రైన్ లో అమానుష ఉదంతం జరిగింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai)  దారుణ ఘటన జరిగింది. తన పనికోసం ముంబై హైకోర్టుకు వెళ్తున్న మహిళ జడ్జీని ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ ఘటన శాంతాక్రూజ్, చర్చ్‌గేట్ స్టేషన్‌ల ప్రాంతంలో.. ఉన్న మధ్య లోకల్ రైలులో సంభవించింది. రైలులో వుమెన్ కంపార్ట్ మెంట్ లో ఎక్కిన మహిళను నీరాజ్ మియాన్ (33) వెంబడించాడు. ఆమె మహిళ కోచ్ లో ఎక్కింది.

యిన కూడా వదిలిపెట్టలేదు. ఆమెను అనుసరించాడు. దీంతో ఆమె తన సహోద్యోగులకు తెలిపింది. దీంతో తర్వాతి స్టేషన్ లో చేరుకుని, అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అతను స్థానికంగా ఉన్న హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Raksha Bandhan, West Bengal

ఉత్తమ కథలు