కేరళ (Kerala Human Sacrifice) లో నరబలి దారుణాన్ని మరవకముందే.. అచ్చం అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ (West Bengal) లో వెలుగు చూసింది. ఓ భూతవైద్యులడు.. మైనర్ బాలికను బలిచ్చాడు. అతీంద్రియ శక్తులు వస్తాయన్న మూఢనమ్మకంతో అమ్మాయిని గొంతుకోసి చంపేశాడు. మాల్దా జిల్లా ఛన్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరాండ గ్రామలో ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెందిన బిక్రమ్ భగత్ అనే వ్యక్తి క్షద్రపూజలు చేస్తుంటారు. భూత వైద్యుడిగా అతడు గ్రామస్తులందరికీ సుపరిచితమైన వ్యక్తి. బుధవారం సాయంత్రం తన పొరుగింట్లో ఉండే 8 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. గ్రామంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ క్షుద్రపూజలు చేసి.. పాపను గొంతుకోసి చంపాడు. పాపను బలిస్తే.. అతింద్రీయ శక్తులు వస్తాయని నమ్మాడు. ఈ క్రమంలోనే ఆ పాపను నరబలి ఇచ్చాడు.
మరుసటి రోజు ఉదయం చెరువు సమీపంలో బాలిక మృతదేహన్ని చూసిన కొందరు స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విగత జీవిగా పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయంత్రం బిక్రమ్ భగత్ వెంట పాప వెళ్లిందని పలువురు చెప్పడంతో.. పాప బంధువులు అతడిని పట్టుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసి..బిక్రమ్ భగత్‌ను చావబాదారు. గ్రామస్తులంతా కలిసి అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి.. వారి నుంచి నిందితుడిని కాపాడారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా కేరళలో ఇటీవల జరిగిన నరబలి దేశవ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. ఎర్నాకులం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను తిరువళ్లకు తీసుకొచ్చి మంత్రతంత్రాలతో బలి ఇచ్చారు. ఈ కేసులో నిందితులు భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను బలిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తుయని నిందితుడు రషీద్.. భగవాల్ సింగ్, లైలా దంపతులను నమ్మించాడు. ఈ క్రమంలోనే రోస్లిన్, పద్మ అనే ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్య తర్వాత వారి శరీర భాగాలను ముక్కలు చేసి.. కూర వండుకొని తిన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Human sacrifice, West Bengal