Home /News /crime /

WEST BENGAL RETURNING FROM BIRTHDAY PARTY WOMAN SEXUALLY MOLESTED BY TWO FRIENDS IN MOVING CAR SU

బర్త్ డే పార్టీ.. కదులుతున్న కారులో యువతిని లైంగికంగా వేధించిన స్నేహితులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతిపై ఆమె స్నేహితులు లైంగిక వేధింపులకు దిగారు. ఓ బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా కదులుతున్న కారులోనే ఈ చర్యకు పాల్పడ్డారు.

    ఓ యువతిపై ఆమె స్నేహితులు లైంగిక వేధింపులకు దిగారు. ఓ బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి వస్తుండగా కదులుతున్న కారులోనే ఈ చర్యకు పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌‌లోని జాదవ్‌పూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేస్టాలా‌కు చెందిన 21 ఏళ్ల బాధిత యువతి స్నేహితులతో కలిసి జాదవ్‌పూర్‌లోని బీక్రామ్‌ఘర్ ప్రాంతంలో జరిగిన ఓ బర్త్‌ డే పార్టీకి హాజరైంది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు మరికొందరు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి బయలుదేరింది. వారిలో ఇద్దరు యువకులతో పాటు మరో యువతి కూడా ఉంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు కదులుతున్న కారులోనే బాధిత యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

    అయితే ఆ సమయంలో కారులోనే ఉన్న మరో యువతి మాత్రం చూస్తూ ఉండిపోయింది. బాధిత యువతి సాయం కోసం అరిచిన కూడా స్పందించలేదు. ఆ తర్వాత బాధిత యువతిని ఆమె స్నేహితులు భోవానిపోరే పోలీస్ స్టేషన్ సమీపంలో కారులో నుంచి బయటపడేసి వెళ్లిపోయారు. అనంతరం బాధిత యువతి మరో స్నేహితుడికి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో అతడు ఆమెను జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను తీసుకెళ్లాడు. అక్కడ బాధిత యువతి ఈ ఘటన గురించి ఫిర్యాదు చేసింది.

    ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు యువకులతో పాటు ఆ సమయంలో కారు ఉన్న యువతి గురించి కూడా గాలింపు చేపట్టామని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. మొబైల్ టవర్ లోకేషన్ ఆధారంగా వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Molestation, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు