పీటల మీద ఆగిన పెళ్లి.. పెళ్లికొడుకు చేసిన పనికి దేహశుద్ది..

మొదట తిరుపతిలో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్న మోహన కృష్ణ.. నంద్యాలలో మరో యువతితోనూ నిశ్చితార్థం చేసుకున్నాడు. రెండో యువతి కుటుంబ సభ్యుల నుంచి కూడా భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నాడు.

news18-telugu
Updated: December 8, 2019, 4:47 PM IST
పీటల మీద ఆగిన పెళ్లి.. పెళ్లికొడుకు చేసిన పనికి దేహశుద్ది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లా నంద్యాలలో పీటలపై ఓ పెళ్లి ఆగిపోయింది. స్థానిక ఆలయంలో జరుగుతున్న మోహనకృష్ణ-లక్ష్మీప్రియల వివాహాన్ని కొంతమంది అడ్డుకున్నారు. మోహనకృష్ణకు దేహశుద్ది చేసి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుపతిలోని ఎస్‌బీఐ బ్యాంకులో పనిచేస్తున్న మోహనకృష్ణ.. మొదట తమ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని.. తమకు తెలియకుండా మరో యువతిని వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యాడని వారు ఆరోపించారు. నిశ్చితార్థ సమయంలో తమ నుంచి రూ.16లక్షలు కట్నం,8 తులాల బంగారం తీసుకున్నట్టు ఆరోపించారు. మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని సమాచారం అందడంతో నంద్యాలకు వచ్చి దేహశుద్ది చేసినట్టు తెలిపారు.

కాగా, మొదట తిరుపతిలో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్న మోహన కృష్ణ.. నంద్యాలలో మరో యువతితోనూ నిశ్చితార్థం చేసుకున్నాడు.

రెండో యువతి కుటుంబ సభ్యుల నుంచి కూడా భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నాడు. మోహన కృష్ణ అంతకుముందే మరో యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడని తెలియక వారు మోసపోయారు. ఎట్టకేలకు వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. తమకు న్యాయం కావాలని ఇద్దరు యువతుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
First published: December 8, 2019, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading