Hyderabad: ఆ కూరగాయల కత్తి, ఈ ఎస్‌ఐ గానీ లేకపోతే భార్యతో గొడవపడిన ఈ భర్త పరిస్థితి ఏమయి ఉండేదో..!

మిథిలేష్‌ను స్టెచ్చర్‌పై తీసుకెళుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్

ఫిలింనగర్ ప్రధాన రహదారిపై సీవీఆర్ న్యూస్ ఛానల్ జంక్షన్ దగ్గర్లో ఆటోప్రైడ్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం ఉంది. ఆ షోరూంకు బీహార్‌‌కు చెందిన మిథిలేష్(40) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ షోరూంలో బిల్డింగ్‌లో ఉన్న ఓ గదిలోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షోరూం మూసేసి ఉండటంతో మిథిలేష్ ఖాళీగా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నోడు ఊరికే ఉండక మద్యం సేవించాడు.

 • Share this:
  హైదరాబాద్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజం. ఎవరో ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే.. రోజూ ఇంట్లో గొడవలు, వాగ్వాదాలు. భార్యాభర్తలిద్దరికీ ప్రశాంతత ఉండదు. భర్త తాగుబోతు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తాగి భార్యతో గొడవపడిన ఓ భర్త క్షణికావేశంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. భార్య కూరగాయలు తరిగే కత్తితో ఉరితాడును కోసేసింది. అయితే.. ఆ సందర్భంలో పై నుంచి కిందపడిన అతని తలకు గాయమై రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆ దగ్గర్లో వాహనాలు తనిఖీ చేస్తూ విధుల్లో ఉన్న ఎస్ఐ ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ ప్రధాన రహదారిపై సీవీఆర్ న్యూస్ ఛానల్ జంక్షన్ దగ్గర్లో ఆటోప్రైడ్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం ఉంది. ఆ షోరూంకు బీహార్‌‌కు చెందిన మిథిలేష్(40) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆ షోరూంలో బిల్డింగ్‌లో ఉన్న ఓ గదిలోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షోరూం మూసేసి ఉండటంతో మిథిలేష్ ఖాళీగా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నోడు ఊరికే ఉండక మద్యం సేవించాడు. తాగిన మత్తులో భార్యతో గొడవపడ్డాడు. అప్పటికే పలుమార్లు మిథిలేష్ తాగి భార్యతో గొడవపెట్టుకునేవాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం సేవించిన మిథిలేష్ తన భార్య చాందినితో గొడవపడ్డాడు. ఈ గొడవ కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

  తాగిన మత్తులో, క్షణికావేశంలో చనిపోతే గానీ మనశ్శాంతి ఉండదంటూ భార్యతో అన్నాడు. అయితే.. తాగిన ప్రతిసారి ఇలానే అంటుటాడని ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. కానీ.. మిథిలేష్ ఈసారి అన్నంత పనిచేశాడు. ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్య చాందినికి కాలూచేయి ఆడలేదు. ఉరి తాడుకు వేలాడి గిలగిలా కొట్టుకుంటున్న భర్తను చూసి షాక్‌కు లోనయిన చాందిని కూరగాయలు కోసే కత్తితో ఉరితాడును కోసేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయిన మిథిలేష్ ఫ్యాన్ సీలింగ్ నుంచి కిందకు పడ్డాడు. ఈ క్రమంలో.. మిథిలేష్‌ తలకు బలంగా దెబ్బ తగిలింది. దెబ్బ గట్టిగా తగలడంతో తల నుంచి రక్తం కారుతూనే ఉంది. తన భర్త పరిస్థితి ఇలా ఉందని.. కాపాడాలని రోడ్డు పక్కన వెళుతున్న వారిని కోరినా ఎవరూ సాయం చేయలేదు.

  ఇది కూడా చదవండి: Hyderabad: కృష్ణకాంత్ పార్క్‌లో జరిగిన యదార్థ ఘటన.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరిదీ యూసఫ్‌గూడే..!

  కానీ.. అక్కడికి దగ్గర్లో వాహనాలు తనిఖీ చేస్తున్న జూబ్లీహిల్స్ ఎస్‌ఐ శివశంకర్ చాందినిని గమనించి ఏమైందని అడిగాడు. ఇలా తన భర్త కిందపడి గాయపడ్డాడని ఆమె చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎస్‌ఐ శివశంకర్ అక్కడికి వెళ్లాడు. ఈలోపు కానిస్టేబుల్స్ అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లో నుంచి అతనిని ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్ స్టెచ్చర్‌పై మోసుకుని అంబులెన్స్‌లోకి ఎక్కించి అపోలో ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతో మిథిలేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చాందినికి ఆ కూరగాయల కత్తితో ఉరితాడు కోయాలన్న ఆలోచన రాకపోయినా, ఆ దగ్గర్లో ఎస్‌ఐ లేకపోయినా మిథిలేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
  Published by:Sambasiva Reddy
  First published: