WARNING METAPHOR FOR WOMEN CLEANING THE HOUSE HAS COME TO LIGHT IN SURAT SSR
Viral Video: కాసేపట్లో ఘోరం జరిగిపోయింది.. ఆ బైక్‌పై ఉన్న అతను చూస్తుండగానే..
సీసీ ఫుటేజ్ దృశ్యం
దీపావళి పండుగ వచ్చేస్తోంది. గృహిణులు ఇంటిని శుభ్రం చేసే పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే.. అలా ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఓ వివాహిత దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది.
సూరత్:దీపావళి పండుగ వచ్చేస్తోంది. గృహిణులు ఇంటిని శుభ్రం చేసే పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే.. అలా ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఓ వివాహిత దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని వరచా ప్రాంతంలో లలితాబెన్ అనే మహిళ దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేస్తోంది.
అయితే.. ఆ ఇల్లు మూడో అంతస్తులో ఉంది. బయట పక్క శుభ్రం చేస్తున్న క్రమంలో ఆమె అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంత ఎత్తు నుంచి కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. లలితాబెన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడి చనిపోయిన ఈ ఘటన సూరత్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇల్లు శుభ్రం చేసే గృహిణులు జాగ్రత్తగా ఉండాలని, మరీ ముఖ్యంగా పై అంతస్తుల్లో ఇల్లు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ దీపావళి లలితాబెన్ కుటుంబంలో విషాదం నింపింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.