లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో వార్డెన్ అరాచకం...నగ్న వీడియోలతో యువతులను బ్లాక్ మెయిల్...

మదన్‌కుమార్ యువతుల నివాసం ఉంటున్న గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. వారికి తెలియకుండా బాత్రూమ్స్ లో సైతం కెమెరాలు ఏర్పాటు చేశాడు.

news18-telugu
Updated: February 18, 2020, 8:27 PM IST
లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో వార్డెన్ అరాచకం...నగ్న వీడియోలతో యువతులను బ్లాక్ మెయిల్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బతుకుదెరువు కోసం, విద్య కోసం పట్టణానికి వచ్చిన యువతులను జీవితాలతో ఆటలాడిన ఓ హాస్టల్ వార్డెన్‌ దుశ్చర్యలకు పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళితే గురుగ్రామ్‌లో ఓ లేడీస్ హాస్టల్‌లో అరాచకం చోటుచేసుకుంది. హాస్టల్ వార్డెన్ మదన్ కుమార్ (పేరుమార్పు) తన వసతి గృహంలో నివాసం ఉంటున్న యువతులతో మంచిగా మెసలుతూనే వారిని జీవితాలతో ఆడుకున్నాడు. మదన్‌కుమార్ యువతుల నివాసం ఉంటున్న గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. వారికి తెలియకుండా బాత్రూమ్స్ లో సైతం కెమెరాలు ఏర్పాటు చేశాడు. వారికి తెలియకుండా సీక్రెట్ వీడియోలను సేకరించేవాడు. ఆ వీడియోలను యువతులకు వీడియో మెసేజ్ రూపంలో పంపి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని, డబ్బులు ఇవ్వాలని ఇలా బ్లాక్ మెయిల్ చేసేవాడు. అయితే తాజాగా పూనం(పేరు మార్పు)కు సైతం ఇదే తరహాలో ఆమె నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో కలత చెందిన పూనం ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్‌లో ఉన్న ఇతర యువతులు అంతా కలిసి పూనంను కాపాడారు. అప్పుడే హాస్టల్ వార్డెన్ నిజస్వరూపం బయటపడింది. యువతులంతా కలిసి పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన పోలీసులు మదన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు